ఎవరైనా ఊహిస్తారా ప్రభుత్వంపై ఆరోపణలు చేయబోయి తామే బొక్కబోర్లా పడ్డ వైనాన్ని. కాంగ్రెస్ నాయకుల నిర్వాకం ఇదే. ప్రధాని మోడీ ని ఇరకాటంలో పెట్టాలని పన్నుల చట్టం సవరణ బిల్లుపై లోక సభలో పిఎం కేర్ ఫండ్ పై వివాదాన్ని లేవనెత్తారు. అసలు ఈ బిల్లు అంతకుముందు సభలో ప్రవేశేపెట్టే రోజే పెద్ద వివాదం అయ్యింది. చివరకు నెహ్రూ, సోనియా గాంధీ పేర్లు ఎత్తినందుకు ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పటంతో సర్డుమనిగింది. కాకపోతే అదే అనురాగ్ సింగ్ ఠాకూర్ బిల్లు కి జవాబు ఇచ్చే దశలో దానికి మూడు రెట్లు కసి తీర్చు కున్నట్లయ్యింది. చివరకు కాంగ్రెస్ అసలు ఈ సమస్యలేవనెత్తి మా నాయకురాలి బతుకు బయటపెట్టటానికి కారణ మయ్యామా అని మధనపడే స్థితి కి వచ్చారు. ప్రభుత్వం లేవనెత్తిన ఏ సమస్యకు వాళ్ళదగ్గర సమాధానాలు లేకుండా అభాసుపాలయ్యారు. ఆ కధేమిటో ఒక్కసారి చూద్దాం.
పిఎం సహాయనిధి కి విరాళాల పై రాద్ధాంతం
అసలు పిఎం సహాయనిధి విరాళాలు రాద్ధాంతమవుతుందని ఎవరైనా ఊహించారా? కానీ ఇది మనదేశంలోనే సాధ్యం. ప్రధానమంత్రి సహాయనిధికి ఎప్పుడో ఒకప్పుడు ప్రతిఒక్కరు విరాళాలు సమర్పించినవాల్లే. చాలామందిమి ఎన్నోసార్లు ఇచ్చాము. ఎందుకంటే దేశంలో ఏ విపత్కర పరిస్థితి వచ్చినా తక్షణం డొనేట్ చేయాలనిపించేది ఎవరికైనా ప్రధానమంత్రి సహాయనిధికే. అటువంటిది ఈ డబ్బులే గాంధీ కుటుంబం తమ స్వంత ట్రస్ట్ ల్లోకి మల్లిస్తుందని ఎవరైనా కలగన్నారా? కానీ ఇది మన కళ్ళముందు కనబడే సత్యం. 1948 లో మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వున్నప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్ధులకు సహాయం చేయటానికి ఏర్పడిన ట్రస్ట్ అది. విచిత్రమేమంటే ఆ ట్రస్ట్ లో సభ్యులుగా శాశ్వతంగా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు వుంటారు. ఈ ట్రస్ట్ ని ఎందుకో రిజిస్టర్ చేయలేదు. అయినా మొదట్లో దీనిపై ఆరోపణలు ఉండేవికావు. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలయిన తర్వాత 2004 లో యుపిఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. అసలు 1985 తర్వాత ఇంతవరకూ ఈ ట్రస్ట్ మీటింగ్ జరగలేదంటే అది ఎలా పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. యుపిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు రావటం మొదలయ్యాయి. ఎప్పుడయితే ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు అందుతున్నాయో దాని ఖర్చు వివరాలపై కూడా ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వుంటుంది.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన వున్న ఈ ట్రస్ట్ సోనియా గాంధీ డబ్బులు కావాలని అడిగినప్పుడల్లా సోనియా గాంధీ కుటుంబ సభ్యులు నడుపుతున్న ట్రస్ట్ ల్లోకి నిధులు తరలించటం జరిగింది. ఇవి ప్రజలు విరాళంగా నమ్మకంతోటి ఇచ్చిన నిధులు. ఇందులో ఆరుకాలం కష్టపడి సంపాదించిన రైతుల దగ్గరనుంచి , పన్ను చెల్లింపుదారుల వరకూ అందరూ తమవంతు ఉడతా భక్తిగా సాయం చేసిన వాళ్ళే. దీనిలోనుంచి గాంధీ కుటుంబ ట్రస్ట్ ల్లోకి నిధులు ఎలా చెల్లించారో మౌనముని మన్మోహన్ సింగ్ సెలవివ్వాలి. సోనియా గాంధీ ఎక్కడపెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టటం కూడా కరెప్ట్ మెంటాలిటీ కిందకే వస్తుంది. తను నిజాయితీ గా ఉండటమే కాదు తన పనులు నిజాయితీగా వుండాలి. ఇక వీరి కుటుంబ ట్రస్ట్ ల్లోకి వచ్చిన నిధులు చూస్తే కళ్ళు తెలేయ్యాల్సిందే. ఇస్లామిక్ ఉగ్రవాద ప్రచారకుడు జాకీర్ నాయక్ నుంచి వేల కోట్ల కుంభకోణం చేసిన మేహెల్ చొక్సి వరకూ అందరూ దాతలే. ప్రభుత్వరంగ సంస్థలు అన్నీ ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్ ల్లోకి నిధులు తరలించాయి. ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టారో చూస్తే విదేశీ ప్రయాణాలకు, క్రైస్తవ మిషనరీలకు విరివిగా ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదీ దీని భాగోతం. అయినా గురివింద గింజ సామెతలాగా ఇంత తమకింద పెట్టుకొని ఇంకొకరిని ఎక్కిరించాలని ప్రయత్నం చేయటం దుస్సాహసమే అవుతుంది. ముందుగా వీటన్నిటికీ జవాబులు చెప్పాల్సిన అవసరం వుంది.
పిఎం కేర్ ఫండ్ ప్రత్యేకంగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
ఇది అందరి మనస్సులో తొలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఇన్ని లోసుగులున్న పిఎం జాతీయ సహాయనిధి ని శాశ్వతంగా ఈ పద్ధతుల్లో నడపటం కష్టమని మోడీ కి అర్ధమయ్యింది కాబట్టి. 2014 లో మోడీ అధికారం లోకి వచ్చాక యధావిధిగా ఈ జాతీయ సహాయ నిధి కొనసాగింది. కానీ ఆ తర్వాత కానీ దీనిలో లొసుగులు ఒక్కొకటి బయటకు వచ్చాయి. ఆశ్చర్యపోవటం మోడీ వంతయ్యింది. అయితే మధ్యలో దీన్ని ఆపటం ప్రజల్లో గందరగోళం సృష్టించే అవకాశం వుంది. ఇప్పటికే ఈ సహాయనిధి నుంచి అవసరమైన వారికి సహాయం చేస్తూ వచ్చారు. కానీ ట్రస్ట్ మీటింగ్ పిలవలేరు. అంటే ప్రధానమంత్రి సహాయ నిధి ట్రస్ట్ మీటింగ్ జరగాలంటే సోనియా గాంధీని పిలవాల్సి వుంది. ప్రతిపక్షం లో వున్న సోనియా గాంధీ ట్రస్ట్ మీటింగ్ కి వస్తుంది అధికారం లో వున్న బిజెపి కి అవకాశం లేదు. అసలు పార్టీల అధ్యక్షుల్ని ట్రస్ట్ లో సభ్యులుగా కొనసాగించటం ఎలా హేతుబద్ధమో కాంగ్రెస్ శ్రేయోభిలాషులు చెప్పాలి కదా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు సహాయ నిధి పై వారసత్వ హక్కులు ఉన్నాయా? అలాగే ట్రస్ట్ ని ఇప్పటికైనా రిజిస్టర్ చేయాలంటే సోనియా గాంధీ కుటుంబానికి వారసత్వ హక్కులు వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షులంటే వాళ్ళ కుటుంబ వారసత్వ హక్కే కదా. అలాగే ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలన్నా ప్రధానమంత్రే అధ్యక్షుడిగా వున్న ట్రస్ట్ కదా. ఎన్ని ఇబ్బందులో ఆలోచించండి? ఇవన్నీ లోక్ సభ లో ప్రభుత్వం బహిరంగంగా చెప్పలేదు. ఎందుకంటే ఎన్ని లోసుగులున్నా ఇప్పటికీ ప్రజల డబ్బులు అందులో వున్నాయి కదా. మోడీ కూడా మొదటి అయిదు సంవత్సరాలు ఈ ట్రస్ట్ నే ఆపరేట్ చేశాడు కదా. అందుకే తెలివిగా రెండో దఫా అధికారం లోకి వచ్చిన తర్వాత కరోనా మహమ్మారి నేపధ్యం లో కొత్త ట్రస్ట్ ని స్థాపించి ఆ మకిలి నుంచి బయట పడటానికి కృషి చేశాడు.
పిఎం కేర్ ఫండ్ పై ఆరోపణల్లో నిజముందా?
ఇది ప్రభుత్వ చారిటబుల్ చట్టం కింద రిజిస్టర్ చేయబడ్డది. ఇందులో ప్రధానమంత్రి , మరికొంతమంది మంత్రులు వాళ్ళ పదవి హోదా ని బట్టే కొనసాగుతారు. కాబట్టి ఎవరికీ వారసత్వ హక్కులు లేవు. దీనికీ పన్ను మినహాయింపు వుంది. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు తీసుకోలేదు. కానీ ప్రభుత్వరంగ సంస్థలు డొనేట్ చేశాయి. చట్ట ప్రకారంగా ఇందులో ఎటువంటి అవరోధాలు లేవు. అయినా జాతీయ సహాయ నిధికి కొన్ని రెట్ల విరాళాలు దీనికి అందాయి. అది ప్రజల్లో ప్రధాన మంత్రి మోడీ పై వున్న నమ్మకం. కేవలం ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలే కాదు ప్రజలు స్వచ్చందంగా ఎప్పుడూ లేనంతగా విరాళాలు ఇచ్చారు. ఇప్పటివరకు ఈ నిధులు కోవిడ్ 19 కోసమే ఖర్చు చేశారు. ఒక్కటి మాత్రం వాస్తవం. మోడీ విధానాలు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఈ నిధుల్ని మోడీ ఎటువంటి పరిస్థితుల్లో తన స్వంతానికి వాడుకోడనే నమ్మకం ప్రజల్లో వుంది. అదే నమ్మకం సోనియా గాంధీ పై లేదు. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసు లో ఎఫ్ ఇ ఆర్ నమోదయ్యింది. ఇదంతా ఎందుకు చెప్పోచ్చాల్సి వచ్చిందంటే పిఎం కేర్ ఫండ్ పై వివాదం లేవదీసి కాంగ్రెస్ తన గొయ్యి తనే తవ్వుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బిజెపి నెహ్రూ-గాంధీ కుటుంబం దేశ ప్రజల నిధుల్ని ఎలా దుర్వినియోగం చేసిందో పూర్తిగా ప్రజలకి లోక్ సభలో వివరించగలిగారు. మొదటిరోజు క్షమాపణలు చెప్పిన అనురాగ్ సింగ్ ఠాకూర్ రెండో రోజు ఎటువంటి ఉద్రేకానికి లోను కాకుండా కాంగ్రెస్ ని, సోనియా గాంధీ ని ఉతికి ఆరేసాడు. ఆవిడని దోషిగా నిలబెట్టటం లో సక్సెస్ అయ్యాడు. ఇక ముక్తాయింపుగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నాయకులకి మొహం లో నెత్తురు చుక్కలేకుండా తెల్లబోయి చూసేటట్లు చేసింది. బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా కొరివితో తలగోక్కున్నామేనని వాపోవటం, విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పెట్టే చివాట్లు ఎలా తట్టుకోవాలా అని ఇప్పట్నుంచే తలపట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. పాపం కాంగ్రెస్ , ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడటమంటే ఇదేనేమో?