వర్క్ ఫ్రం హోం
కరోనా ప్రభావంతో ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉంటుంది. కానీ ఏపీ సీఎం జగన్ కరోనా సెకండ్ వేవ్ లో ప్రజల కష్టాలు పట్టించుకోకుండా వర్క్ ఫ్రం హోం సాగిస్తుండడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంటికే పరిమితమైన సీఎంను ఇంటికే సాగనంపాలని విమర్శలు చేస్తున్నాయి. అయినా జగన్ లో చలనం లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు. తిరుపతిలో పదకొండు మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారనే విషయం సీఎం జగనే ప్రకటించడం చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో..
సీఎం జగన్ ఇల్లు దాటకపోవడంపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న వేళ ప్రభుత్వం గొప్పగా పని చేస్తుందని సీఎం జగన్ చెప్పుకుంటున్నావాస్తవం లేదని ప్రతిపక్షాలు అవహేళన చేస్తున్నాయి.