https://oktelugu.com/

జగన్ కు క్షత్రియుల మద్దతు ఉంటుందా?

జగన్ సర్కారుకు క్షత్రియ సామాజిక వర్గం వార్నింగ్ ఇస్తోంది. దీన్ని రాష్ర్ట ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. క్షత్రియ సామాజిక వర్గంలో వైసీపీకి నెగెటివ్ అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు చేష్టలు కూడా వైసీపీకి చెడు చేసేవిగా ఉన్నాయి. రఘురామ చర్యల్లో హుందాతనం లేకపోవడంతో సర్కారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రఘురామ అంశాన్ని పూర్తిగా రాజకీయ కోణంలోనే క్షత్రియ సమాజం చూస్తోంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత విజయనగరం […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 21, 2021 / 01:33 PM IST
    Follow us on

    జగన్ సర్కారుకు క్షత్రియ సామాజిక వర్గం వార్నింగ్ ఇస్తోంది. దీన్ని రాష్ర్ట ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. క్షత్రియ సామాజిక వర్గంలో వైసీపీకి నెగెటివ్ అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు చేష్టలు కూడా వైసీపీకి చెడు చేసేవిగా ఉన్నాయి. రఘురామ చర్యల్లో హుందాతనం లేకపోవడంతో సర్కారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రఘురామ అంశాన్ని పూర్తిగా రాజకీయ కోణంలోనే క్షత్రియ సమాజం చూస్తోంది.

    మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత విజయనగరం రాజవంశీయుడు అశోక్ గజపతిరాజు విషయంలో కూడా జగన్ సర్కారు వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పెద్దమనిషిగా పేరొందిన ఆయన పట్ల జగన్ సర్కారు కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందనే భావన వ్యక్తం అవుతోంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో క్షత్రియ సామాజిక వర్గం విమర్శలకు దూరంగా ఉంటోంది. క్షత్రియ వర్గంపై వైసీపీ నేతలు వాడుతున్న అసభ్య పదజాలాన్ని పరిగణనలోకి తీసుకుని వారి మద్దతు ఉపసంహరించుకునే ప్రమాదం పొంచి ఉంది.

    మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించి చైర్మన్ అశోక్ గజపతి రాజును దించేయాలని భావించి సంచైతను చైర్మన్ గా ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పుతో మళ్లీ అశోక్ గజపతి రాజే ట్రస్ట్ చైర్మన్ కావడంతో వైసీపీ కి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో వైసీపీ సంచైతను వైసీపీ ప్రభుత్వంలో మంచి స్థానం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో క్షత్రియ సామాజికవర్గం మెల్లగా పార్టీకి దూరమయ్యే సందర్బాలు సైతం వస్తున్నాయి. దీంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు చీలిపోకుండా చూసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్డి, కమ్మ, క్షత్రియ సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఓట్లు చీలిపోకుండా చూసుకునేందకు ప్రయత్నాలు చేస్తోంది.