కేజీ కుంకుమ పువ్వు ధర రెండున్నర లక్షలు.. ఎందుకంత ఖరీదంటే..?

సాధారణంగా చాలామంది కుంకుమ పువ్వును బంగారంతో పోలుస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. కుంకుమ పువ్వు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మన దేశానికి చెందిన వాళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాటిలో కుంకుమ పువ్వు ఒకటని చెప్పవచ్చు. కుంకుమ పువ్వు చాలా ఖరీదైనది కాగా కుంకుమ పువ్వు ఆహార రుచిని కూడా పెంచుతుంది. కుంకుమ పువ్వును పండించడం కూడా తేలిక కాదు. ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన కుంకుమ పువ్వు ధరలు ఎక్కువగా ఉండటానికి అసలు […]

Written By: Navya, Updated On : June 21, 2021 1:33 pm
Follow us on

సాధారణంగా చాలామంది కుంకుమ పువ్వును బంగారంతో పోలుస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. కుంకుమ పువ్వు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మన దేశానికి చెందిన వాళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాటిలో కుంకుమ పువ్వు ఒకటని చెప్పవచ్చు. కుంకుమ పువ్వు చాలా ఖరీదైనది కాగా కుంకుమ పువ్వు ఆహార రుచిని కూడా పెంచుతుంది. కుంకుమ పువ్వును పండించడం కూడా తేలిక కాదు.

ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన కుంకుమ పువ్వు ధరలు ఎక్కువగా ఉండటానికి అసలు కారణం పంట పూర్తిగా కోసిన తర్వాత కుంకుమ పువ్వు తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఒకటిన్నర చదరపు అడుగులలో సాగు చేస్తే కేవలం 50 గ్రాముల కుంకుమ మాత్రమే వస్తుంది. ఎక్కువ భూమిలో సాగు చేస్తే మాత్రమే కేజీలలో కుంకుమ పువ్వు వస్తుంది. ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కుంకుమ విత్తనాలను వేయాల్సి ఉంటుంది.

15 సంవత్సరాల తరువాత మళ్ళీ పంటను తొలగించాలి. ఒక పువ్వులో మూడు పోగులు మాత్రమే అందుబాటులో ఉండగా దాదాపు లక్షన్నర పువ్వులు కలిస్తే ఒక కిలో కుంకుమ పువ్వు తయారు అవుతుంది. ఆయుర్వేద ఔషధాల తయారీలో సైతం కుంకుమ పువ్వును ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో, రక్తాన్ని శుభ్రపరచడంలో కుంకుమ పువ్వు సహాయపడుతుంది.

ప్రతి పువ్వు నుండి కుంకుమ ఆకులు మాత్రమే తీస్తే 160 కుంకుమ ఆకులను బయటకు తీసినప్పుడు ఒక గ్రాము కుంకుమ పువ్వు తయారవుతుంది. కుంకుమ పువ్వును చాలా పువ్వుల నుండి వేరు చేస్తే కుంకుమ పువ్వు తయారవుతుంది. ఒక గ్రాము కుంకుమ పువ్వు 100 లీటర్ల పాలలో సరిపోతుంది.