రేవంత్ రెడ్డికి షాక్.. వెంకటరెడ్డి ఢిల్లీలో లాభీయింగ్..!

  తెలంగాణ పీసీసీ పదవిపై రోజు రోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. ఆ పదవి దక్కించుకునేందకు పార్టీలోని నాయకులు తమదైన శైలిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నాకంటే నాకే.. అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పార్టీలో ఉన్నది కొద్దిమంది నాయకులే అయినా వీరి మధ్య పీసీసీ చీఫ్ కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంటకరెడ్డి ఢిల్లీ పెద్దలను కలిసి లాభీయింగ్ చేస్తుండడంతో ఆయన ఆ పదవి కోసం ఎంత […]

Written By: NARESH, Updated On : June 21, 2021 2:37 pm
Follow us on

 

తెలంగాణ పీసీసీ పదవిపై రోజు రోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. ఆ పదవి దక్కించుకునేందకు పార్టీలోని నాయకులు తమదైన శైలిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నాకంటే నాకే.. అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పార్టీలో ఉన్నది కొద్దిమంది నాయకులే అయినా వీరి మధ్య పీసీసీ చీఫ్ కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంటకరెడ్డి ఢిల్లీ పెద్దలను కలిసి లాభీయింగ్ చేస్తుండడంతో ఆయన ఆ పదవి కోసం ఎంత ఆరాటపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఉన్న కొద్ది మంది నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లడంతో పార్టీకి సరైన నాయకుడు కావాలని డిమాండ్ పెరింది. ఈ నేపథ్యంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే అప్పటి నుంచి పీసీసీ చీఫ్ ఎవరోనన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలో దూకుడుగా ఉన్న రేవంతర్ రెడ్డిపైనే అందరి దృష్టి ఉంది. యూత్ ఫాలోయింగ్ తో పాటు అధికార పార్టీపై ఫైట్ చేయడానికి రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇవ్వాలని కొందరు భావించారు. ఒకానొక సమయంలో వీహెచ్, తదితర సీనియర్ నాయకులు మినహా కోమటిరెడ్డి బ్రదర్స్ సైతం రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇస్తే తమకు అభ్యంతరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పార్టీ ఇన్ చార్జితె అభిప్రాయ సేకరణ చేసింది. ఇందులో ముగ్గురు పేర్లు ఉన్నట్లు సమాచారం.

అయితే రేవంత్ రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యం ఉందని చర్చించుకుంటున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తే మాత్రం రేవంతర్ రెడ్డికి చెక్ పెట్టే విధంగా కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా ఢిల్లీకి వెళ్లి తనకు అధ్యక్ష పదవి ఇస్తే తప్పేంటి..? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డికి మాత్రం చీఫ్ పదవి అస్సలు ఇవ్వకూడదని అన్నట్లు తెలుస్తోంది. కానీ ఏఐసీసీ మాత్రం అందరి అభిప్రాయాలను క్షుణ్ణంగా పరిశీలించి నాయకులందరినీ సంతృప్తి పరచాలని చూస్తోంది.