AP Politics: ఏపీలో వరదలపై రాజకీయం నడుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో విపరీతమైన నష్టం సంభవించింది. కాగా, ఇలా వరదల వల్ల ప్రజలు నష్టపోవడానికి ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ప్రకృతి వైపరీత్యం, వరద ఉధృతి వల్లే నష్టం జరిగిందని, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు అందుకే కొట్టుకుపోయాయని అధికార వైసీపీ అంటోంది. మొత్తంగా ఈ విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా జగన్ సర్కారుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దారుణమైన కామెంట్లు చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. భారీ వర్షాల వలన వచ్చిన వరదలకు కడపలోని అన్నమయ్య ప్రాజెక్టు గేట్లే కొట్టుకుపోయాయి. నీటి ప్రభావం వలన 62 మంది చనిపోయారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టలేదని, దాంతో అవి సకాలంలో ఓపెన్ కాలేదని, ఫలితంగా వరద నీటి తీవ్రత ఇంకా ఎక్కువై ప్రమాదం జరిగిందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు.
కనీసం గేటుకు గ్రీజు కూడా పెట్టలేని సీఎం జగన్ మూడు రాజధానులు నిర్మిస్తాడా అని విమర్శించారు.
గేట్ ఓపెన్ కాలేదని చెప్పి వైసీపీ నేతలు సర్ది చెప్పుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. గతంలో ప్రాజెక్టులకు వరదల వస్తున్న సందర్భంలో గేట్లు ఓపెన్ చేసి ఉంచేవారని, అలా ఓపెన్ చేసి ఉంచడం వలన వరద నీరు ఫ్రీగా వెళ్లిపోయి ఎటువంటి నష్టం జరగకపోయేదని చంద్రబాబు గుర్తు చేశారు. గేట్ సమస్య చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇసుక కోసం రివర్‌లోకి వెళ్లిన టిప్పర్లను రక్షించేందుకుగాను, నీటిని విడుదల చేయలేదని, వరద హెచ్చరికల పట్ల జగన్ సర్కారు సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల వల్లే ప్రాణ నష్టం జరిగిందని, రూ.6 వేల కోట్ల పంట నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగిందని చంద్రబాబు అన్నారు.
Also Read: ఏపీలో జగన్ పరిస్థితి ఏంటి? మళ్లీ గెలవగలడా? టీడీపీ పోటీనిస్తుందా?
ఇటీవల కాలంలో ఏపీ అసెంబ్లీలో తన భార్యను అవమానించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తాను సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేశాడు. దాంతో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ అప్పుడే రాజకీయ క్షేత్రంలో పోటీ కనబడుతోంది. అధికార వైసీపీపై టీడీపీ యుద్ధం ప్రకటించి మరి రంగంలోకి దిగింది. చూడాలి మరి.. ఎన్నికల సమయం వరకు ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుందో..
Also Read: లోకేష్ ను చంద్రబాబే ఓడించారట..?