S. Thaman: టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనగానే ముందుగా వినిపించే పేరు ‘తమన్’దే. తమన్ ఖాతాలో ప్రస్తుతం అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి. పైగా భారీ యాక్షన్ చిత్రాలకు తమన్ బెస్ట్ అనే పేరు ఉంది. ముఖ్యంగా ‘పక్కా మాస్’ సినిమాలకు తమన్ సంగీతం చాలా ప్లస్ అవుతుంది.

హీరోయిజమ్ ఎలివేట్ అయ్యే కొద్దీ తమన్ మ్యూజిక్ కూడా హైలైట్ అవుతూ సాగడంతో ఇప్పుడు పెద్ద హీరోలందరూ మాకు తమనే కావాలి అంటున్నారు. నిజానికి నేపథ్య సంగీతం ఇవ్వడంలో మణిశర్మ తోపు, ఆ తర్వాత ఆ స్థాయిలో నేపథ్య సంగీతానికి ప్రాణం పోసిన వ్యక్తి దేవి శ్రీ ప్రసాద్. అయితే, మణిశర్మ ఫేడ్ అవుట్ దశలో ఉన్నాడు, ఇక దేవిలో మునుపటి వాడి లేదు.
దాంతో యాక్షన్ సినిమాలు కూడా తమన్ దగ్గరకే వచ్చాయి. అయితే, సినిమాలు పెరిగే కొద్దీ తమన్ లో మాస్ బీట్ కూడా పెరుగుతూ పోతుండటం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘క్రాక్’ సినిమా దగ్గర నుంచి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ స్టైల్ కూడా మారుతూ వచ్చింది. దీనికితోడు తమన్ ఏ సినిమా చేసినా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.
Also Read: వేరే ఆడవాళ్ళలో లేనివి నాలో ఏమైనా ఉన్నాయా ?
ఆఖరకు ‘అఖండ’ విషయంలో కూడా అదే జరిగింది. ‘అఖండ’ విజయంలో తమన్ దే కీలక పాత్ర. ముఖ్యంగా అఖండ సినిమా సెకండ్ పార్ట్ లో తమన్ నేపథ్య సంగీతం సినిమాని నిలబెట్టింది. వాస్తవానికి అఖండ సెకండ్ పార్ట్ లో పెద్దగా కథ లేదు. అలాగే ఫైట్స్ మోత భారీగా ఉంటుంది. ఇలాంటి విషయంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కొంతవరకు తడబడతాడు,
కరెక్ట్ గా ఏ బీజీఎమ్ కొట్టినా అది పర్ఫెక్ట్ గా అనిపించదు. కానీ, తమన్ ఇలాంటి చోటే తన మార్క్ చూపిస్తున్నాడు. అందుకే తమన్ నేపథ్య సంగీతం సూపర్ హిట్ అవుతుంది. సినిమాని కూడా హిట్ అయ్యే రేంజ్ కి తీసుకువెళ్తుంది. దీనిబట్టి తమన్ మోత ఇక ఇప్పట్లో ఆగేలా లేదు.