Bharat
Bharat: భారత దేశానికి ఉన్న ఇంగ్లిష్ పేరు ఇండియా మారబోతోందా అంటే అవుననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ఈ దిశగా కేంద్రం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నెల 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు సాగే పార్లమెంట్ ప్రత్యేక భేటీలో ఈ మేరకు ఇండియా పేరును భారత్ గా మారుస్తూ కేంద్రం బిల్లు తీసుకురానున్నట్లు సమాచరం. అధికార బీజేపీ ఎంపీలతోపాటు ఢిల్లీ వర్గాల్లో సాగుతున్న చర్చల సారాంశం ప్రకారం.. ఇండియా ఇకపై భారత్ గా పేరు మార్చుకోనున్నట్లు తెలుస్తోంది.
స్వదేశీ మంత్రం..
ఇప్పటికే ప్రతీ అంశంలోనూ స్వదేశీ మంత్రం జపిస్తున్న కేంద్రం.. దేశానికి కూడా ఇంగ్లీష్ పేరు అయిన ఇండియాకు బదులుగా భారత్ అనే పేరు పెట్టే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే బ్రిటీష్ కాలం నాటి ఎన్నో నల్ల చట్టాలతోపాటు కీలకమైన ఐపీసీ, సీఆర్పీపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ను కూడా పేర్లు మార్చి భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్న కేంద్రం.. పనిలో పనిగా ఇండియా పేరు కూడా మార్చబోతున్నట్లు తెలుస్తోంది.
పేరు మార్పుకు మరో కారణం..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ఇండియా పేరు మార్పు ప్రయత్నాల వెనుక మరో కీలక కారణం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న కూటమికి ఇండియా పేరు పెట్టారు. ఇప్పుడు బ్రిటీశ్ కాలం నాటి పేరన్న కారణంతో ఇండియాను వదిలిపెట్టి భారత్ గా పేరు మార్చేస్తే అప్పుడు విపక్షాల్ని విదేశీ పేరుతో టార్గెట్ చేయొచ్చన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విపక్షాలకు చెక్ పెట్టేందుకు కూడా కేంద్రం ఇండియా పేరు భారత్ గా మార్చనుందన్న చర్చ జరుగుతోంది.
రాజ్యాంగ సవరణ తప్పనిసరి..
ఇండియా పేరు మార్చాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ఇండియా పేరు పెడుతూ చేసిన చట్టాల్ని సవరించి భారత్ పేరు పెట్టాల్సి ఉంటుంది. ఈ బిల్లుకు లోక్ సభలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. రాజ్యసభలోనూ ఈ మధ్య ఎన్డీయే నెగ్గించుకున్న బిల్లుల్ని చూస్తే ఇక్కడా పేరు మార్పు బిల్లు ఆమోదం నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. దీంతో ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇతర కీలక బిల్లులతో పాటు ఇండియా పేరు మార్పు బిల్లు పెట్టొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి.
జీ20 ఆహ్వాన పత్రంలో ‘భారత్’గా ముద్రణ..
ఇదిలా ఉంటే.. భారత్‌లో ఈనెల 7 నుంచి జరిగే జీ20 దేశాల సమావేశాలకు ఆయా దేశాలకు పంపే ఆహ్వాన పత్రికను కేంద్రం ముద్రించింది. ఇందులో ‘‘ఇన్‌వైట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ బదులు ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించింది. దీంతో ఇండియా పేరు మార్పు ఖాయం అన్న వాదనలకు బలం చేకూరుతోంది.
పేరు మార్పుపై స్పందన..
ఇండియా పేరు మార్పుపై రాజకీయ పార్టీలతోపాటు పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా పేరు మార్పును తప్పు పట్టింది. తమ కూటమికి ఇండియా పేరు పెట్టినందుకే కేంద్రం కుట్రపూరితంగా దేశం పేరు మార్చాలని చూస్తోందని ఆరోపించింది. ఇక అసో ముఖ్యమంత్రి హేమంత్ బిస్వశర్మ కూడా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో స్పందించారు. ఇండియా పేరు మార్పును స్వాగతించారు. బిగ్‌బీ అమితాబచ్చన్ కూడా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ ట్యాగ్ చేశారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Will indias name be changed to bharat the government is likely to pass a resolution in a special session of parliament
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com