https://oktelugu.com/

Hyderabad Press Club: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రద్దు కానున్నాయా?

Hyderabad Press Club: తెలంగాణలోని కీలకమైన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అవకతవకలపై ప్రెస్ క్లబ్ సభ్యుల ఫిర్యాదు మేరకు నిర్వాహకులు ఆ దిశగా డిసైడ్ అయ్యారు. ఇక ప్రెస్ క్లబ్ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలైంది. నిబంధనలు పాటించకుండా ఎన్నికలు నిర్వహించారని పిటీషనర్ ఆరోపించారు. ప్రధానంగా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై స్వస్తిక్ గుర్తు కాకుండా మరో గుర్తు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2022 / 08:20 PM IST
    Follow us on

    Hyderabad Press Club: తెలంగాణలోని కీలకమైన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అవకతవకలపై ప్రెస్ క్లబ్ సభ్యుల ఫిర్యాదు మేరకు నిర్వాహకులు ఆ దిశగా డిసైడ్ అయ్యారు. ఇక ప్రెస్ క్లబ్ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలైంది. నిబంధనలు పాటించకుండా ఎన్నికలు నిర్వహించారని పిటీషనర్ ఆరోపించారు.

    ప్రధానంగా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై స్వస్తిక్ గుర్తు కాకుండా మరో గుర్తు ఉందని.. దానిని పరిగణలోకి తీసుకోకుండా ఓట్లు లెక్కించాలని వాదనలు జరిగాయని పేర్కొంటున్నారు. ఈ మేరకు కోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.

    గత ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు జరిగిన ఎన్నికల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బ్యాలెట్ పేపర్ పైన ఓటు వేయడానికి స్వస్తిక్ గుర్తును మాత్రమే ఉపయోగించాలి. కానీ కొన్ని బ్యాలెట్ పేపర్ల పై రౌండ్ ముద్ర, మరికొన్ని బ్యాలెట్ పేపర్ ల పైన ఇంటూ గుర్తులు ఉన్నాయి. ఇవి గమనించిన ప్రెసిడెంట్ అభ్యర్థి సూరజ్ భరద్వాజ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన అభ్యంతరాన్ని తెలియజేశారు.

    అదే విధంగా పోలైన మొత్తం ఓట్లు, అభ్యర్థులకు పడ్డ ఓట్లు, చెల్లని ఓట్లు, మొత్తం సమానం కాలేదు. అంటే మొత్తం ఓట్లలో కొన్ని ఓట్లు గల్లంతయ్యాయి. ఈ అంశాలపై ప్రధానంగా అభ్యంతరం తెలపడంతో స్వస్తిక్ గుర్తుకు బదులు రౌండ్ సీల్ ఎలా వచ్చింది. కొన్ని బ్యాలెట్ పేపర్ల పై ఇంటూ గుర్తు ఎలా వేశారు అనేది తేలేంత వరకు హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి నిలిపి వేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు.

    రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద జర్నలిస్టుల క్లబ్ అయిన హైదరాబాద్ లో పదవులు నిర్వహిస్తే అది వారిని అధికార పార్టీలకు చేరువ చేస్తుందని.. అందుకే మేనేజ్ మెంట్ కమిటీని కైవసం చేసుకునేందుకు బడా జర్నలిస్టులంతా రంగంలోకి దిగి గెలిచేందుకు చాలా తతంగం నడిపారని ఆరోపణలున్నాయి.

    ఇక ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భారీగా డబ్బు చేతులు మారిందని.. పోలింగ్ కు ఒకరోజు ముందు కొందరు ప్రెస్ క్లబ్ సభ్యులకు డబ్బు పంచి సీనియర్ జర్నలిస్టుల మద్దతును కొనుగోలు చేశారని ప్రచారం సాగుతోంది.