బ్యాడ్ న్యూస్: 2022 వరకు కరోనా వ్యాక్సిన్!?

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరిని తొలుస్తున్న ప్రశ్న.. ‘కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? అది ఎప్పటిలోగా వస్తుంది. మళ్లీ ఎప్పుడు ప్రపంచం పునరుద్ధరణ జరుగుతుందనేది అసలు ప్రశ్న. అయితే అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ చావుకబురును చల్లగా చెప్పాడు ఎయిమ్స్ డైరెక్టర్.. భారతదేశంలో కరోనావైరస్ నిర్వహణపై జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణదీప్ గులేరియా. కోవిడ్ వ్యాక్సిన్ కోసం సామాన్య ప్రజలు 2022 వరకు వేచి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కొరోనావైరస్ వ్యాక్సిన్ భారతీయ మార్కెట్లలో సులభంగా […]

Written By: NARESH, Updated On : November 8, 2020 6:28 pm
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరిని తొలుస్తున్న ప్రశ్న.. ‘కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? అది ఎప్పటిలోగా వస్తుంది. మళ్లీ ఎప్పుడు ప్రపంచం పునరుద్ధరణ జరుగుతుందనేది అసలు ప్రశ్న. అయితే అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ చావుకబురును చల్లగా చెప్పాడు ఎయిమ్స్ డైరెక్టర్.. భారతదేశంలో కరోనావైరస్ నిర్వహణపై జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణదీప్ గులేరియా. కోవిడ్ వ్యాక్సిన్ కోసం సామాన్య ప్రజలు 2022 వరకు వేచి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కొరోనావైరస్ వ్యాక్సిన్ భారతీయ మార్కెట్లలో సులభంగా లభించడానికి “సంవత్సరానికి పైగా” సమయం పడుతుందని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణదీప్ గులేరియా మాట్లాడారు.. 130 కోట్లకు పైగా భారతీయులకు కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయడానికి 2022 వరకు సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఫ్లూ వ్యాక్సిన్ లాగా టీకాను మార్కెట్ నుంచి కొనుగోలు చేయడానికి చాలా సమయం పడుతుంది. వాస్తవానికి ఇది మరింత ఆలస్యం కావచ్చు’ అని ఆయన అన్నారు.

Also Read: జోబైడెన్ రాకతో హెచ్1బీ ఆంక్షలు రద్దు అవుతాయా?

“మనకు తరువాత వచ్చిన టీకా మొదటిదాని కంటే ఎక్కువ ప్రభావవంతంగా కనిపిస్తే మళ్లీ ప్రజలందరికీ రెండో టీకాను వేయాలని రణదీప్ తెలిపారు. అది ఎంత డోస్ వేయాలి? ఎక్కడ తగ్గించాలి? ఎవరికి పెంచాలనేది గందరగోళం అవుతుందని ఆయన అన్నారు. టీకాలతో కరోనావైరస్ సంక్రమణ “అంతరించిపోదు” అని నొక్కి చెప్పాడు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచంలోని దేశాలకు పంచడంలో టీకా ఉత్పత్తి – డెలివరీలో తమ సామర్థ్యాలను ఉపయోగిస్తామని భారతదేశం అనేక దేశాలకు ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ ఉత్పత్తిలో భారత్ ది గొప్ప పాత్ర అవుతుందని ఆయన తెలిపారు.

Also Read: బీజేపీలోకి రాములమ్మ.. ముహుర్తం ఖరారైందా?

కరోనావైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారతదేశం ఎదుర్కోవాల్సిన సవాళ్ళ గురించి ఆయన వివరించారు. ప్రధానంగా వ్యాక్సిన్ పంపిణీ.. దేశంలోని ప్రతి ప్రాంతానికి చేరేలా చూసుకోవడం ముఖ్యం అన్నారు. “వ్యాక్సిన్ భద్రపరచడం, తగినంత సిరంజిలు, తగినంత సూదులు కలిగి ఉండటం మరియు దేశంలోని మారుమూల ప్రాంతానికి ఆటంకం లేకుండా అందించడం అతిపెద్ద సవాలు” అని ఆయన అన్నారు. మరొక టీకా శక్తివంతమైనది వస్తే దాన్ని ప్రజలకు పంచాల్సి ఉంటుంది. ఇది మొదటిదాని కంటే ఎక్కువ ప్రభావవంతంగా కనిపిస్తే మళ్లీ ప్రాసెస్ మొదటికొస్తుందని తెలిపారు.