5 State Election Exit Polls: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. 2024 ఎన్నికలకు రెఫరెండంగా భావించే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరిగాయి. ఏడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, ఆప్ తదితర పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా వీటిపై అందరిలో ఉత్కంఠ ఏర్పడింది. ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు పార్టీలు కూడా తమ బలాబలాలు బేరీజు వేసుకుని ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. తమదే విజయం అనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆసక్తికరంగా మారాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తేల్చింది. పంజాబ్ లో ఆప్ అధికారం చేజిక్కించుకుంటుందని అంచనా వేసింది. మణిపూర్ లో కూడా బీజేపీ మళ్లీ అధికారం సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. గోవా, ఉత్తరాఖండ్ లలో హంగ్ అసెంబ్లీ వస్తుందని సర్వేలు సూచిస్తున్నాయి. దీంతో అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో నేడు వెలువడుతున్న ఫలితాలపై చర్చలు కొనసాగుతున్నాయి.
Also Read: కేసీఆర్ నిర్ణయంతో జగన్ కు కూడా ఇబ్బందేనా?
ఉత్తరప్రదేశ్ లో మరోమారు బీజేపీ అధికారం హస్తగతం చేసుకుంటుందని సర్వేలు వెల్లడించాయి. యోగి ఆదిత్య నాథ్ కు మరోసారి ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పంజాబ్ లో కాంగ్రెస్ పాలనకు చెక్ పెట్టి ఆప్ కు అధికారం అప్పజెప్పేందుకు ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ ను పక్కన పెట్టినట్లు సర్వేలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి తీర్పునిచ్చారో అనే సందేహం అందరిలో వస్తోంది.

బీజేపీ పై వ్యతిరేకత వస్తోందని ప్రతిపక్షాలు చెబుతున్నా దాని ప్రతిష్ట మాత్రం తగ్గడం లేదు. ఉత్తరప్రదేశ్ లో మరోసారి బీజేపీకే అధికారం ఇచ్చేందుకు ఓటర్లు ఆలోచించినట్లు సర్వేలన్నీ చెబుతున్నాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా ఈ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనే అధికారం సాధిస్తుందని తెలుస్తోంది. దీంతో గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోతుందో ఏమో అనే అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు విజయవంతం అవుతాయో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం తలకిందులైన సందర్భాలు ఉన్న నేపథ్యంలో నేడు వెలువడే ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడిందని చెబుతున్నారు.
Also Read: ఈ సారి కూడా కేసీఆర్ పాచిక పారనుందా?