Disagreement Candidates: మామూలుగానే ఏ పార్టీలో అయినా అసంతృప్తులు ఎక్కువగానే ఉంటారు. ఇక అధికార పార్టీ అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు టీఆర్ ఎస్ లో ఇలాంటి అసంతృప్త నేతలు అందరూ ఒక్క చోటకు వచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఏం చేద్దాం, ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్దాం అనే కార్యాచరణను రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ నియంతృత్వ పోకడలు వారిలో అసంతృప్తిని రాజేసినట్టు తెలుస్తోంది.

వీరిలో ఎక్కువగా గతంలో పదవులు అనుభవించి ఇప్పుడు ఏ పదవి లేకుండా ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. కాగా పాలమూరు జిల్లాకు చెందిన కృష్నారావు నేరుగా ఖమ్మం వెళ్లి పొంగులేటి, తుమ్మలతో భేటీ అయ్యారు. వీరంతా పార్టీ మారుతారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.
Also Read: ఈ సారి కూడా కేసీఆర్ పాచిక పారనుందా?
ఒక్కరిగా నిర్ణయం తీసుకునే కంటే.. కలిసికట్టుగా బలమైన నిర్ణయం తీసుకుంటే మేలని భావించినట్టు తెలుస్తోంది. తాము గతంలో పార్టీ కోసం చేసిన సేవల్ని ఇప్పుడు కేసీఆర్ మర్చిపోవడం, తమకు ఎలాంటి పదవి ఇవ్వకుండా ఇప్పుడు బయట నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారనే బాధ వారిలో బలంగా ఉంది. పైగా తాము ఓడిపోయిన చోట.. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని పార్టీలోకి తీసుకుని.. తమను పక్కన పెట్టేయడం వారిని మరింత బాధకు గురి చేస్తోంది.

ఎలాగూ కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. కాబట్టి ఈ లోగానే కేసీఆర్ నుంచి బలమైన హామీని తీసుకోవాలని లేదంటే పక్క దారి చూసుకోవాలని వీరంతా మూకుమ్మడిగా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. తమ మొదటి ప్రాధాన్యత మాత్రం టీఆర్ ఎస్‌కే ఇవ్వాలని, కాదంటేనే.. పక్క పార్టీలవైపు చూడాలనుకుంటున్నారు. కాకపోతే ఒక్కొక్కరిగా అడిగితే పెద్దగా గుర్తింపు ఉండదు కాబట్టి.. కలిసి కట్టుగా ముగ్గురూ ఒకేసారి తమ డిమాండ్లను ముందు పెడితే కేసీఆర్ కూడా కీలకమైన నేతలను వదలుకోవడానికి సిద్ధపడడు కాబట్టి తమకు ఏమైనా ఫలితం ఉంటుందని వీరి ఆవేదన.
Also Read: ముందస్తు కోసమే కేసీఆర్ నిరుద్యోగులకు వరాలు ప్రకటించారా?