KCR- BRS: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది. దీంతో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందో లేదో అనే చర్చలు మొదలయ్యయి. అయితే అలాంటి పుకార్లకు చెక్ పెట్టారు. గులాబీ బాస్ కె.చంద్రశేకర్‌రావు. ముందు చెప్పినట్లుగానే దసరా రోజు జాతీయ పార్టీపై ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పార్టీ నేతలతో సమాలోచనలు కూడా దాదాపుగా పూర్తిగా చేశారు.

నోటిఫికేషన్‌తో ఉత్కంఠ
దసరా రోజున ప్రకటించబోయే జాతీయ పార్టీ ద్వారానే మునుగోడు ఉప ఎన్నికల బరిలో ఉంటామని కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇంత తొందరగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని టీఆర్‌ఎస్ ఊహించలేదు. కానీ కేసీఆర్ పార్టీ నేతలతో ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈసీ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో.. ఈ ఉప ఎన్నిక మరింత హాట్ టాపిక్‌గా మారింది. అనుకున్నట్టుగానే దసరా రోజున జాతీయ పార్టీపై ప్రకటన ఉంటుందని.. పార్టీ నేతలంతా ముందుగా చెప్పిన సమయానికి టీఆర్‌ఎస్ భవన్‌కు చేరుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు అందరిలోనూ ఒకే రకమైన చర్చ జరుగుతోంది.
బరిలో బీఆర్‌ఎస్సా? లేక టీఆర్‌ఎస్సా?
కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తే.. ఆ పార్టీ ద్వారానే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేక టీఆర్‌ఎస్ పేరుతోనే మునుగోడు ఉప పోరులో ఉంటామా? అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కొత్త పార్టీ పేరుతో మునుగోడు ఉప ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నా.. అందుకు సంబంధించి ఈసీ దగ్గర నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉందని సమాచారం. దీంతో కేసీఆర్ ఏ విధమైన వ్యూహంతో ముందుకు సాగుతారనే అంశం ఆసక్తి రేపుతోంది.
గెలిస్తేనే జాతీయపార్టీ సక్సెస్..
అయితే టీఆర్‌ఎస్ జాతీయ పార్టీ సక్సెస్ కావాలంటే.. ముందుగా ఆ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరం చాలా ఉంటుంది. లేకపోతే సొంత రాష్ట్రంలో విజయం సాధించలేకపోయిన టీఆర్‌ఎస్.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా విజయం సాధిస్తుందనే చర్చ మొదలవుతుంది. విపక్షాలకు ఇది పెద్ద అస్త్రంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికకు ముందు జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్న కేసీఆర్.. ఈ ఉప ఎన్నికను ఏ విధంగా ఎదుర్కొబోతున్నారన్నది కూడా ఉత్కంఠగా మారింది.

పార్టీ రిజిస్ట్రేషన్ జాప్యం చేసే అవకాశం..
దసరా రోజు ప్రకటించే జాతీయ పార్టీని కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించలేదు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో పార్టీ ప్రకటిస్తే తప్పనిసరిగా ఉప ఎనినకల్లో కొత్త పార్టీపై పోటీ చేయాల్సి ఉంటుంది. అదే జరిగి అభ్యర్థి ఓడిపోతే జాతీయ పార్టీకి పెద్ద నష్టం తప్పదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే జాతీయ పార్టీని ప్రకటించి దాని రిజిస్ట్రేషన్ మాత్రం మునుగోడు ఉప ఎన్నికల తర్వాత చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేయిస్తే ఎన్నికల సంఘం వెంవెంటనే రిజిస్టర్ చేస్తే కేసీఆర్‌కు, జాతీయ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
నిర్ణయం ఈసీ కోర్టులో..
పార్టీ రిజిస్ట్రేషన్ అంతా జాతీయ ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించి వెంటనే రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే దానిని ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలన్నది ఎన్నికల సంఘం స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుంది. వెంటనే ఇవ్వొచ్చు లేదా ఏదైనా కారణంతో నెల నుంచి ఏడాది లోపు కూడా ఇచ్చే అవకాశం ఉంది. వైఎస్సార్ టీపీ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్న ఏడాదికి ఈసీ గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు టీఆర్‌ఎస్ పెట్టే జాతీయ పార్టీకి గుర్తింపు విషయంలో తుది నిర్ణయం ఈసీ చేతిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: AP Minister Ambati Rambabu: సినిమాల్లో నటించిన వైసీపీ మంత్రి అంబటి రాంబాబు
[…] Also Read: KCR- BRS: మునుగోడు బరిలో టీఆర్‌ఎస్సా..? బీఆర… […]
[…] Also Read:KCR- BRS: మునుగోడు బరిలో టీఆర్‌ఎస్సా..? బీఆర… […]