https://oktelugu.com/

చిరంజీవి రాజకీయం చేయనున్నారా?

చిరంజీవి సినిమా రంగంలో తిరుగులేని వ్యక్తి. తన ఇమేజ్ తో రాజకీయ రంగాన్నిసైతం ఊపేయాలని భావించి ఆయనే ఊసులేకుండా పోయారు. సినిమా వేరు, రాజకీయాలు వేరు అని తెలుసుకున్నారు. అందుకే బుద్ధిగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇటీవల ఆయన మనసు మళ్లీ రాజకీయాల వైపు మళ్లిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చేనా అని సినీ ఇండస్ర్టీ గుసగుసలాడుతోంది. ఇప్పటికే చేయి కాల్చుకుని అంతా సర్దుకుని పని చేసుకుంటుంటే మళ్లీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 1, 2021 9:55 am
    Follow us on

    చిరంజీవి సినిమా రంగంలో తిరుగులేని వ్యక్తి. తన ఇమేజ్ తో రాజకీయ రంగాన్నిసైతం ఊపేయాలని భావించి ఆయనే ఊసులేకుండా పోయారు. సినిమా వేరు, రాజకీయాలు వేరు అని తెలుసుకున్నారు. అందుకే బుద్ధిగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇటీవల ఆయన మనసు మళ్లీ రాజకీయాల వైపు మళ్లిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చేనా అని సినీ ఇండస్ర్టీ గుసగుసలాడుతోంది. ఇప్పటికే చేయి కాల్చుకుని అంతా సర్దుకుని పని చేసుకుంటుంటే మళ్లీ రాజకీయ ప్రస్థానం గురించి కలలు కనడం నిజమేనా అని పలువురు ఆలోచనలో పడ్డారు.

    2014లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఊపేద్దామని కలలు కన్నారు. కానీ కాంగ్రెస్ ఊపులో కనుమరుగైపోయారు. కాంగ్రెస్ రాష్ర్ట విభజన చేయడంతో పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. రాజకీయాలకు స్వస్తి పలికారు. గత ఎన్నికలకు ముందు తానిక రాజకీయాల్లోకి రానని తమ్ముడు పవన్ కల్యాణ్ ద్వారా సందేశం పంపారు. కానీ ప్రస్తుతం చిరంజీవి మనసు మారినట్లుగా ఉందని ప్రచారం జో రుగా సాగుతోంది. దీనికి తోడు ఇటీవల కాలంలో చిరంజీవి సేవా కార్యక్రమాలు విరివిగా చేస్తున్నారు. ప్రచారం సైతం అదేరీతిలో ఉండాలన కోరుకుంటున్నారు. దీంతో చిరంజీవి కదలికలపై అనుమానాలు కలుగుతున్నాయి.

    సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల ఆక్సిజన్ బ్యాంకుల విషయంలో విపరీతంగా మైలేజీ వస్తుందని ఆశించారు. రాకపోయే సరికి నిరాశచెందారు. ఆంధ్రప్రభలో చిరంజీవిపై ఓ కథనం రావడంతో పొంగిపోయారు. మిగతా పత్రికల్లో రాలేదని విచారం వ్యక్తం చేశారు. ఇవన్ని చూస్తుంటే చిరంజీవి మనసు మళ్లీ రాజకీయాల వైపు మళ్లిందనే విషయం తెలుస్తోంది. తన సేవలను ప్రజలు బాగా గుర్తించాలని భావిస్తున్నారు.

    బాస్ ఈజ్ బ్యాక్ అనే పద్దతిలో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. సేవా కార్యక్రమాలు చేసి ప్రత్యేకంగా ప్రచారం చేసుకునేందుకు ప్రత్యేక పీఆర్ టీంపె ట్టుకున్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే చిరంజీవిలో రాజకీయాల్లో రాణించాలనే తపన రేగినట్లు కనిపిస్తోంది. ఇలాంటి పనులు చేయడంలోనే ఆయనలోని మర్మం తెలుస్తోంది. ఇక అరంగేట్రమే తరువాయి అంటున్నారు. వేచి చూడాలి ఏం జరుగుతుందో?