Trivikram Dialogues in Bheemla Nayak: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్ను నుంచి జాలువారే డైలాగులకు ఎం క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఆయన భీమ్లానాయక్‌లో తన పెన్ను పవర్‌ను పూర్తి స్థాయిలో చూపించేశాడు. ఈ మూవీలో 16డైలాగులు అయితే పవన్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్నాయి. అంతలా మైమరిపించేశాడు గురూజీ. అవేంటో చూద్దాం.
ఈమూవీలో రావు రమేష్ డైలాగ్.. నిత్యా మీనన్ గ్రూప్ ను చూసినప్పుడు మీరు మొగుళ్లకు అన్నాలెట్టరు.. మగాళ్లు కనిపిస్తే దన్నాలెట్టరు.. ఛీఛీ ఏం బతుకులే మీవి అంటూ చెప్పడం చాలా సెటైరికల్ గా అనిపించింది.
రానాను పట్టుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ పక్కనున్న కానిస్టేబుల్ తో డైలాగ్.. ఒంటిమీద యూనిఫారం వేసుకున్నాక నీ ఇగోని ఇంట్లో తాళం వేసి పెట్టి రా.. ఇక్కడ రూల్స్ ఫాలో కాకపోతే తోలు తీస్తా అంటూ చెబుతాడు.
ఇక పోలీస్ స్టేషన్ వద్ద పవన్ కళ్యాణ్ రానాతో డైలాగ్.. భీమ్లా భీమ్లా నాయక్.. ఏంటి చూస్తున్నావ్ పేరు కింద క్యాప్షన్ లేదనేనా మనకు అక్కర్లేదు.. నువ్వు కట్టుకుని రా అంటాడు.
నిత్యా మీనన్ టూ రావు రమేశ్ తో డైలాగ్.. నాయక్ పెళ్లాం అంటే నాయక్‌లో సగం కాదు.. నాయక్‌కు డబుల్ అంటూ చెప్పడం అందరితో విజిల్స్ వేయించింది.
పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్.. స్టేట్ బోర్డర్ వద్ద ఒక మందు బాటిల్ కనిపిస్తేనే లోపలేస్తాం.. అలాంటిది నువ్వు వైన్ షాపే మోసుకొస్తున్నావ్ మరి నిన్ను అరెస్ట్ చేయక.. సన్మానం చేస్తామా అంటూ పంచ్ వేస్తాడు.
పోలీస్ స్టేషన్‌లో పవన్ డైలాగ్.. ఏమయ్యా రామస్వామి ఎఫ్ఐఆర్ రాయవయ్యా. వీడు బలిసి కొట్టుకుంటున్నాడయ్యా.. నా కొడుక్కి దింపేద్దాం అంటూ పవర్ చూపిస్తాడు.
బయటకు వచ్చాక రానా టూ నిత్యా మీనన్ డైలాగ్.. నీ మొగుడు గబ్బర్ సింగ్ అట.. పోలీస్ స్టేషన్‌లో అదే అంటున్నారు.. నేనెవరో తెలుసా.. ధర్మేంధ్ర హీరో అంటూ దర్జా చూపిస్తాడు.
రానా టూ రావు రమేష్ డైలాగ్.. అక్కడ 1000 వాలా పేలుతుంటే.. మనకు ఇక్కడ కాకరపువ్వత్తితో మాటలేంట్రా అంటూ అంటాడు.. అందుకు రావు రమేశ్ చెప్తూ.. ఆ 1000 వాలాను అంటించాలంటే.. కావాల్సింది ఈ కాకరపువ్వత్తే కదండి అంటూ సమాధానం ఇస్తాడు.
ఇంట్లో సముద్రఖని టూ రానా డైలాగ్.. ఈ ఇంటికి ఒక మగాడు కావాలి వాడి అడ్రస్ మిస్ అయిపోయింది. నువ్వు వెళ్లి తీసుకురా అంటూ వార్నింగ్ ఇస్తాడు.
పవన్ టూ రానా డైలాగ్.. నీకు యూనిఫారమ్ బలం కానీ నాకు అడ్డం అందుకే తీసేసాను.. కాబట్టి ఇప్పుడు ఏమైనా చేస్తా అంటూ మాస్ డైలాగ్ చెప్తాడు.
పవన్ టు రానా డైలాగ్.. నువ్ నన్ను పీకెయ్ నేను మొలుస్తా, నువ్ తొక్కేయ్ నేను లేస్తా, నేను ఓడినా సరే మళ్లీ వచ్చి ఆపలేని యుద్ధాన్ని నీకు ఇస్తాను అంటూ చెప్తాడు.
ఇక రానా పవన్‌ను మోసేసిన డైలాగ్.. నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అంటూ పవన్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని గురూజా రాశాడు.
మురళీ శర్మ టు రానా డైలాగ్.. వైల్డ్ యానిమల్‌కు కళ్లెం వేసినట్లు ఇన్ని రోజులు అతన్ని కంట్రోల్ చేసేందుకు యూనిఫారం వేసి కూర్చోబెట్టాం. ఇప్పుడు నువ్వు దాన్ని తీసేసావ్.
పవన్ టు నిత్యా మీనన్ డైలాగ్.. నేను ఇటువైపు ఉంటేనే చట్టం కాదని అటువైపు వెళ్తే కష్టం వాడికే అంటూ రానాను ఉద్ధేశించి చెప్తాడు. ఇలా ఒక్కో డైలాగ్ పంచుల వర్షాన్ని కురిపించింది. సన్నివేశానికి హైప్ తీసుకు వస్తున్నట్టు ఉన్నాయి డైలాగులు.