గులాబీ గుబాళిస్తుందా.. ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ ఫలితాలు ఇప్పుడే తేలేలా లేవు. మరో రోజున్నర అయినా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి లేదా.. శనివారం ఉదయం వరకు ఫలితాలు డిక్లేర్‌‌ అయ్యేలా ఉన్నాయి. పోటీ హోరాహోరీగా సాగడంతో.. ఎవరికీ మొదటి ప్రాధాన్యతా ఒట్లలో యాభై శాతం దక్కలేదు. Also Read: ప్రజల సొమ్ముతో జగన్ ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లింపు..! హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల […]

Written By: Srinivas, Updated On : March 19, 2021 1:46 pm
Follow us on


తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ ఫలితాలు ఇప్పుడే తేలేలా లేవు. మరో రోజున్నర అయినా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి లేదా.. శనివారం ఉదయం వరకు ఫలితాలు డిక్లేర్‌‌ అయ్యేలా ఉన్నాయి. పోటీ హోరాహోరీగా సాగడంతో.. ఎవరికీ మొదటి ప్రాధాన్యతా ఒట్లలో యాభై శాతం దక్కలేదు.

Also Read: ప్రజల సొమ్ముతో జగన్ ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లింపు..!

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు రెండింటిలోనూ ఇప్పటివరకైతే టీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. నల్లగొండ నుంచి బరిలో ఉన్న పల్లాకు కంఫర్టబుల్ లీడ్ అందుతోంది. అక్కడ తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో.. కోదండరాం మూడో స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రేసులో కూడా లేరు. నాలుగో స్థానానికే పరిమితం అయ్యారు. అయితే.. హైదరాబాద్‌ స్థానానికి మాత్రం బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారు.

అయినా కూడా.. పీవీ కుమార్తె సురభి వాణీదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆ ఆధిక్యం కూడా మూడు, నాలుగు వేల ఓట్ల మధ్యలోనే ఉంటోంది. యాభై శాతం ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో.. సెకండ్‌ ప్రయారిటీ ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. అయితే.. ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేదన్న వాదన రాజకీయ నిపుణుల్లో వినిపిస్తోంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయమైనట్లే. ద్వితీయ ప్రాధాన్య ఓట్లు కొద్దిగా వచ్చినా ఆయన విజయం సాధిస్తారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ మాత్రం ఉత్కంఠగా మారుతోంది.

Also Read: బంగారు తెలంగాణలో తలసరి అప్పు రూ.1,05,000

హైదరాబాద్‌ పరిధిలో గెలుపోటములు తారుమారయ్యే చాన్స్ కూడా ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి.. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గట్టి పోటీనే ఇస్తున్నారు. బరిలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ మూడో స్థానంలో ఉన్నారు. అయినా కూడా చాలా ఎక్కువ ఓట్లే తేడా కనిపిస్తోంది. దీంతో ఆయన ముందుకు రావడం కష్టంగా మారుతోంది. రేపు ఉదయానికి గెలుపెవరిదో.. ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నా.. అధికారిక ప్రకటన మాత్రం మరో రోజు రోజున్నర పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్