యూపీని గాడిలో పెడతారా?

ఉత్తరప్రదేశ్ పరిణామాలపై కేంద్రం ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తోంది. పార్టీని గాడిలో పెట్టే పనిలో నిమగ్నమైంది. వచ్చే ముప్పును ముందుగానే అంచనా వేసి దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. కాయకల్ప చికిత్సకు పూనుకుంటోంది. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీపై పట్టు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే పలు రకాల చర్యలు తీసుకుంటోంది. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్ ముందుంటుంది. ఈ నేపథ్యంలో యూపీలో మెజార్టీ సాధించే లక్ష్యంతో అలర్ట్ అవుతోంది. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ […]

Written By: Srinivas, Updated On : June 30, 2021 5:48 pm
Follow us on

ఉత్తరప్రదేశ్ పరిణామాలపై కేంద్రం ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తోంది. పార్టీని గాడిలో పెట్టే పనిలో నిమగ్నమైంది. వచ్చే ముప్పును ముందుగానే అంచనా వేసి దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. కాయకల్ప చికిత్సకు పూనుకుంటోంది. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీపై పట్టు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే పలు రకాల చర్యలు తీసుకుంటోంది. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్ ముందుంటుంది. ఈ నేపథ్యంలో యూపీలో మెజార్టీ సాధించే లక్ష్యంతో అలర్ట్ అవుతోంది.

యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పై విమర్శలు పెరుగుతున్నాయి. ఆయన పరిపాలనపై మైనస్ మార్కులే పడుతున్నాయి. దీంతో కేంద్రం తన శాయిశక్తులా దారికి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. మోడీ మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలంటే యూపీ లాంటి రాష్ర్టాల అవసరం ఎంతో ఉందని గుర్తిస్తోంది. సీఎం ఆదిత్యనాథ్ పై విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. రాష్ర్టంలో తుపాకీ రాజ్యమేలుతోందని చెబుతున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోందని తెలుస్తోంది.

యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పై వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. బీజేపీ నేతలు మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. దీంతో కేంద్రం ఎప్పటికప్పుడు యూపీని ప్రాధాన్యం పెంచాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించాలని చూస్తోంది. పార్టీపై వ్యతిరేకత లేకుండా చేసే క్రమంలో కేంద్రం తన వంతు సహకారాన్ని అందించేందు సిద్ధంగా ఉందనే విషయం స్పష్టమవుతోంది.

త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ఉత్తరప్రదేశ్ కు పెద్ద మొత్తంలో మంత్రి పదవులు ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. రెండో విడతలో రాష్ర్టం నుంచి కనీసం 8 మందికి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలంటే ప్రజల మద్దతు అవసరమని గుర్తించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యోగికి ఇచ్చిన స్వేచ్ఛతో ఆయన మంచికి బదులు చెడే ఎక్కువగా చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మోడీ ఇప్పటికే యూపీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ లోను యూపీ భవిష్యత్తుపై చర్చ జరిగినట్లు తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ విజయం సాధించాలంటే చేపట్టబోయే చర్యలపై ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పార్టీ ప్రక్షాళన చర్యలపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారోనని పార్టీ నేతలు భావిస్తున్నారు.