BJP: వచ్చే ఏడాది భారతదేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇంకో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు మరోసారి అధికారంలోకి రావాలంటే ఈ ఐదు రాష్ట్రాల్లో పాగా వేయాల్సిందేనని అనుకుంటున్నారు. అందుకుగాను రకరకాల వ్యూహాలు రచించుకుంటున్నారు. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే సీ-ఓటర్ ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది. అందులో ఏ పార్టీ వైపు ఈ ఐదు రాష్ట్రాల ప్రజలు మొగ్గు చూపారంటే..

ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా ఐదు రాష్ట్రాల్లో కమలం పార్టీ అధికారంలోకి వస్తుందని, పంజాబ్‌లో సంకీర్ణ ప్రభుత్వం రావొచ్చని అంచనావేశారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇకపోతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కంపల్సరీగా విజయం సాధిస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టేట్‌లో 403 స్థానాలకు గానూ 212-224 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని జోస్యం చెప్తున్నారు బీజేపీ నేతలు. ఇకపోతే తాము 2017లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన లోక కల్యాణ్ పత్ర హామీలన్నిటినీ నెరవేర్చామని, ప్రజలు తమను మరోసారి గెలిపిస్తారని యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తామని యోగి ఆదిత్యానాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఆప్, కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఉండొచ్చని అంటున్నారు. మాజీ సీఎం అమరీందర్ సింగ్ పార్టీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య వెరీ టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక్కడ ఈ సారి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే చాన్సెస్ ఉన్నాయి.
Also Read: PM Modi in Varanasi: కాశీలో కాలినడక.. ప్రధాని మోడీ అభివృద్ధి పైనే ప్రత్యేక దృష్టి
ఇక గోవాలో ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పట్టు నిలుపుకునే చాన్సెస్ కనబడుతున్నాయి. ఇక్కడ మిగతా పార్టీ పర్ఫార్మెన్స్ గతం కంటే కొంచెం బెటర్‌గా ఉండొచ్చని, కానీ, కంప్లీట్‌గా సక్సెస్ అవుతాయని అయితే చెప్పలేమని పలువురు అంచనా వేస్తున్నారు. మణిపూర్‌లోనూ బీజేపీయే మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధినాయకత్వం చాలా క్లియర్ కట్ ప్లాన్ వేసుకుందని తెలుస్తోంది. ప్రధాని మోడీ సైతం ఈ రాష్ట్రలకు ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీ నేతలను అలర్ట్ చేశారని సమాచారం. ఇటీవల ప్రధాని మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు రైతులకు క్షమాపణ చెప్పిన నేపథ్యం కూడా మళ్లీ బీజేపీని ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Narendra Modi: ఇందుకే మోడీ.. ప్రజల మనుసు గెలిచేది?