Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam Movie: "సంచారి" అంటూ వచ్చేస్తున్న ప్రభాస్... రాధే శ్యామ్ నుంచి స్వీట్...

Radhe Shyam Movie: “సంచారి” అంటూ వచ్చేస్తున్న ప్రభాస్… రాధే శ్యామ్ నుంచి స్వీట్ న్యూస్

Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో వేచి చూస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

third song promo released from prabhas radhe shyam movie

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా వరుసగా అప్డేట్స్‌ ఇస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మూవీ మేకర్స్‌. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ ప్రేమకథ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరణ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ‘చలో… చలో… సంచారి అంటూ సాగే ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌ ఆలపించారు. కాగా ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. ఈ నెల 16న పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ సాంగ్‌ టీజర్‌లో ప్రభాస్ స్టైలిష్ అండ్‌ ల్యావిష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్కర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version