https://oktelugu.com/

రాష్ట్రానికి భారీ మొత్తంలో అప్పు ఆఫర్ ఇచ్చిన ట్రస్ట్..

లెక్కకు మించిన సంక్షేమ పథకాలు, కరోనా నేపథ్యంలో అదాయం పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా కుదేలయ్యింది. అయినప్పటీకీ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజల ఖాతాల్లో రూ. వేల కోట్లను జమ చేస్తుంది. ఫలితంగా ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితికి ప్రభుత్వం చేరుకుంది. గడచిన మూడు నెలల్లో రూ.15 వేల కోట్లు అప్పులను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. గత ఏడాదిలో రూ.77 వేల కోట్లు అప్పటు చేసింది. దీంతో జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం రూ.92 […]

Written By: , Updated On : July 14, 2020 / 12:28 PM IST
Follow us on

Andhrapradesh Map
లెక్కకు మించిన సంక్షేమ పథకాలు, కరోనా నేపథ్యంలో అదాయం పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా కుదేలయ్యింది. అయినప్పటీకీ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజల ఖాతాల్లో రూ. వేల కోట్లను జమ చేస్తుంది. ఫలితంగా ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితికి ప్రభుత్వం చేరుకుంది. గడచిన మూడు నెలల్లో రూ.15 వేల కోట్లు అప్పులను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. గత ఏడాదిలో రూ.77 వేల కోట్లు అప్పటు చేసింది. దీంతో జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం రూ.92 వేల కోట్ల మేర అప్పులు చేసినట్లు ఆర్ధిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ప్రస్తుత అర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ఇప్పడు ఇంత పెద్దమొత్తంలో అప్పులు చేయడంపై ప్రతిపక్షాలు దుమ్మెతిపోస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ కి అప్పుల తిప్పలు!

కేంద్రం నుంచి అరకొరగా మాత్రమే నిధులు అందుతుండటంతో అప్పుల వేటలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికాలోని ఓ ట్రస్ట్ శుభవార్త చెప్పింది. భారీ మొత్తంలో అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ట్రస్టు రూ.లక్ష కోట్ల వరకూ అప్పు మంజూరు చేసేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉండటంతో… ప్రభుత్వం ఆపద కాలంలో ట్రస్ట్ నుంచి ఏలాగైనా అప్పు తీసుకోవాలని చర్యలు చేపట్టింది. విదేశీ సంస్థ కావడంతో అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన కలిసి వేడుకున్న అంశం ఈ అప్పునకు సంబంధించిందేననే విషయం బయటకు వచ్చింది. నిర్మల మాత్రం పరిశీలిస్తామని మాత్రమే చెప్పారట, అనుమతి ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం. బుగ్గన ఢిల్లీ వెళ్లిన రహస్యం బయట పడటంతో ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత పెద్దమొత్తంలో అప్పు తీసుకోవడం రాష్ట్రానికి మంచిది కాదని భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.

అమెరికా ట్రస్ట్ ఇచ్చే రూ.లక్ష కోట్ల అప్పులో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ మొత్తంలో కేటాయింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.67 వేల కోట్లు ఇందుకు కేటాయించాలని, మరో 14 వేల కోట్లు పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మరో 14 వేల కోట్లు వైద్య సదుపాయాల అభివృద్ధికి కేటాయించనున్నారనే వాధనలు వినిపిస్తున్నాయి. 4 శాతం వడ్డీతో 40 ఏళ్ల వ్యవధిలోగా అప్పు తీర్చేందుకు అవకాశాన్ని ట్రస్టు రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించింది. మరోవైపు రాష్ట్రానికి అప్పులు ఇచ్చేందుకు దేశీయ భ్యాంకులు, సంస్థలు పెద్దగా ఆశక్తి చూపడం లేదు. ఇంధుకు కారణం కొన్నేళ్లుగా రాష్ట్ర బడ్డెట్ లో మూలధన వ్యయానికి కేటాయింపులు భారీగా తగ్గిపోవడం, సంక్షేమ పథకాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ పరిస్థితి నెలకొంది.

జగన్ పట్టుదల.. టెక్ దిగ్గజం ఏపీకి..

ఇంత పెద్దమొత్తంగా రాష్ట్రానికి అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అమెరికా ట్రస్ట్ ఇందుకు ఓ మెలిక పెట్టింది. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పు ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన ఈ విషయాన్ని ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిని విన్నవించి సాయం చేయాలని కోరారు. హామీ ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. ఇందుకు జాతీయ స్థాయిలో ఉన్న చట్టాలు, రిజర్వు బ్యాంక్ నిభందనలకు అనుకూలంగా ఉంటేనే అప్పు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కరొనా కాలంలో ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంస్థ వివరాలు ఇంకా బయటకు వెళ్లడి కాలేదు. ఈ అంశం మాత్రం జాతీయ స్థాయిలోనే చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక పూర్వాపరాలు, ప్రవేటు ట్రస్ట్ గురించి కేంద్రం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది.