గతంలో కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వమే వేసేది. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్లు ఆర్డర్ పెట్టుకుంటున్నాయి. చిన్న, మధ్య స్థాయి ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉండడం లేదు. కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకునే అవకాశం ప్రవేటే ఆస్పత్రులకు కల్పించింది. దీంతో ప్రభుత్వ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు తమ ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నాయి. డబ్బులున్న వారికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదని వారు కొనుగోలు చేస్తారని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ టీకాల వ్యవహారంపై స్పందించారు.
ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్లు ఇవ్వకూడదని జగన్ లేఖ రాయడంతో సంచలనం కలిగింది. టీకాలు వేయడానికి వయల్స్ పంపాలని సీఎం కోరడంతో తప్పు లేదని కానీ ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా నిలిపివేయాలని కోరడం కరెక్టు కాదు. ఏపీలో ప్రైవేటు ఆస్పత్రులపై అధికారులు విరుచుకుపడుతున్నారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయకపోతే ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. ఆ అక్కసుతోనే ప్రైవేటు ఆస్పత్రులపై కక్ష సాధింపుతోనే సీఎం ఈ విధంగా చేస్తున్నారని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేస్తే నిధులు రాకపోవడంతో ఆస్పత్రులు ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వమే ప్రైవేటు ఆస్పత్రులపై కావాలనే రాద్దాంతం చేస్తున్నారని తెలుస్తోంది.
ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్లు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరడంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు పెట్టుకోవాలని కేంద్రం చెప్పింది. దీంతో తమకు వ్యాక్సిన్లు అడగడం లేదు. జగన్ లేఖలు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది.