టీకా ధరల వ్యత్యాసం కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం

కేంద్ర ప్రభుత్వం టీకాల పంపిణీలో స్పష్టమైన విధానం అవలంభించడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ టీకా విధానంపై దేశ న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. ప్రజల ప్రాణాలు హరిస్తున్నకరోనా మహమ్మారిని నిరోధించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని అడిగింది. టీకాలకు ఒకే దేశంలో వేర్వేరు ధరలు ఎందుకు నిర్ణయించారని అభ్యంతరం తెలిపింది. జాతీయ టీకా విధానంలో వేర్వేరు ధరలు ఉండొచ్చా? వ్యాక్సిన్ల సేకరణ వ్యవహారంలో రాష్ర్టాలు అధిక రేట్లు ఎందుకు చెల్లించాల్సి వస్తుందని సూటిగా ప్రశ్నించింది. […]

Written By: Srinivas, Updated On : May 31, 2021 8:36 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వం టీకాల పంపిణీలో స్పష్టమైన విధానం అవలంభించడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ టీకా విధానంపై దేశ న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. ప్రజల ప్రాణాలు హరిస్తున్నకరోనా మహమ్మారిని నిరోధించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని అడిగింది. టీకాలకు ఒకే దేశంలో వేర్వేరు ధరలు ఎందుకు నిర్ణయించారని అభ్యంతరం తెలిపింది. జాతీయ టీకా విధానంలో వేర్వేరు ధరలు ఉండొచ్చా? వ్యాక్సిన్ల సేకరణ వ్యవహారంలో రాష్ర్టాలు అధిక రేట్లు ఎందుకు చెల్లించాల్సి వస్తుందని సూటిగా ప్రశ్నించింది.

జాతీయ టీకా విధానంపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది. దీనిపై ఈ ఉదయం విచారణ చేపట్టింది. జస్టిస్ లావు నాగేశ్వర్ రావు, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ రవీంద్రభట్ లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అంశంపై వాదోపవాదాలు ఆరంభించింది. జాతీయ టీకా విధానంపై పలు ప్రశ్నలు అడిగింది. కొవిడ్ ప్లాట్ ఫాం ద్వారా మాత్రమే తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి వ్యాక్సిన్లు అందించాల్సి వస్తే .. గ్రామీణుల మాటేమిటని నిలదీసింది.

జాతీయస్థాయిలో ఒకే విధానాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం వ్యాక్సిన్ల సేకరణ విషయంలో రాష్ర్టాలపై అధిక భారం మోపడం సరికాదు. 45 సంవత్సరాల పైనున్న వారకి వంద శాతం టీకాలు సమకూర్చిన కేంద్రం18 నుంచి 44 సంవత్సరాల లోపు వారి కోసం అందులో సగం కూడా అందుబాటులోకి ఎందుకు తీసుకుని రాలేకపోయింది. ప్రభుత్వః ఆస్పత్రుల్లో , ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇంకోరకంగా వ్యాక్సిన్ రేట్లను నిర్ధారించింది.

దేశంలో కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారిలో 45 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారే అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ వయసు కేటగిరీ ప్రజల కోసం ఎందుకు వ్యాక్సిన్లు వేయడం లేదు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లకు ఒకే ధర ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.