తెలంగాణలో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతోందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తార్నాకలో సోమవారం పోలీస్ చెక్ పోస్ట్ ను డీజీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించిందని ఆయన అన్నారు. కరోనాను అంతం చేసేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో తెలంగాణలో నేరాల శాతం తగ్గిందని వెల్లడించారు.