కవిత గెలుపుపై ఎందుకింత ప్రచారం..! కారణమేంటి?

పలు పేపర్లు.. పలు ఛానెళ్లలో వచ్చినట్లుగా.. లేదా టీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నట్లుగా కవిత భారీ మెజార్టీతో గెలించిందా..? అసలు ఆ ఎన్నికలు ఏంటి..? అక్కడి ఓటర్ల సంఖ్య ఎంత..? వచ్చిన మెజార్టీ ఎంత..? ఓటు వేయాల్సింది ప్రజాప్రతినిధులే కదా..! మరి ఆ ప్రజాప్రతినిధులంతా ఏ పార్టీపై గెలిచిన వారు..? అందరూ గులాబీ నేతల అయినప్పుడు కవిత గెలుపు సునాయసనమే కదా. ఆ మాత్రం దానికి ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌ పార్టీ కవిత గెలుపును ఎందుకు నొక్కి వక్కానిస్తున్నట్లు..? […]

Written By: NARESH, Updated On : October 15, 2020 5:49 pm
Follow us on


పలు పేపర్లు.. పలు ఛానెళ్లలో వచ్చినట్లుగా.. లేదా టీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నట్లుగా కవిత భారీ మెజార్టీతో గెలించిందా..? అసలు ఆ ఎన్నికలు ఏంటి..? అక్కడి ఓటర్ల సంఖ్య ఎంత..? వచ్చిన మెజార్టీ ఎంత..? ఓటు వేయాల్సింది ప్రజాప్రతినిధులే కదా..! మరి ఆ ప్రజాప్రతినిధులంతా ఏ పార్టీపై గెలిచిన వారు..? అందరూ గులాబీ నేతల అయినప్పుడు కవిత గెలుపు సునాయసనమే కదా. ఆ మాత్రం దానికి ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌ పార్టీ కవిత గెలుపును ఎందుకు నొక్కి వక్కానిస్తున్నట్లు..? భారీ మెజార్టీతో గెలుపొందినట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నట్లు..? ఇదంతా మున్ముందు జరిగే ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎత్తులు అన్నట్లేనా..? ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలో బయటపడాలంటే ఈ పబ్లిసిటీ తప్పదా..?

Also Read: వరద బీభత్సం.. కేటీఆర్ లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి నల్లేరుపై నడకే అయినా..అధికార పార్టీ వేసిన ఎత్తులు విపక్ష నాయకుల్లో హీట్‌ పెంచాయి. ఆమె ఎన్నిక లాంఛనమే అయినా భారీ స్థాయిలో ప్రలోభాలు కొనసాగాయి. ఈ ఎమ్మెల్సీలో మొత్తం 824 ఓట్లు ఉన్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ 413. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటికి టీఆర్‌ఎస్ పార్టీకి సుమారు 610 ఓట్లు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితే కాదు మరెవ్వరిని బరిలోకి దింపినా గెలుపు ఖాయం. కానీ.. ఇక్కడేదో అద్భుతం సాధించినట్లుగా అధికార పార్టీ గొప్పలు చెప్పుకుంటోంది. మీడియాలో కలర్‌ఫుల్‌ యాడ్స్‌ ఇస్తూ ఆర్భాటం చేస్తోంది.

ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయిందో.. అప్పటి నుంచే ఇతర పార్టీల లీడర్లను తమ పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించింది టీఆర్‌‌ఎస్‌. ఈ చేరికల కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తీవ్రంగా శ్రమించారు. అస్త్రశస్త్రాలు సంధించారు. చివరకు కవితకు రికార్డు స్థాయిలో మెజారిటీనే కట్టబెట్టారు. పోల్ అయిన మొత్తం 823 కాగా.. కవితకు 728 వచ్చాయి. సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన లక్ష్మీనారాయణకు 56 ఓట్లు వచ్చాయి. లక్ష్మీనారాయణపై 672 ఓట్ల మెజారిటీతో కవిత విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్‌రెడ్డికి 29 ఓట్లు మాత్రమే దక్కాయి. వాస్తవానికి అధికార పార్టీకి ఉన్న ఓట్లతో పోల్చుకుంటే ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు రావు కూడా. చివరికి అదే జరిగింది. కానీ.. విపక్ష పార్టీల డిపాజిట్లు గల్లంతయ్యాయని గులాబీ నాయకులు ప్రత్యేకంగా ప్రచారం చేసుకుంటున్నారు.

Also Read: ఏడాది వర్షం.. ఒక్క రోజులోనే కురిసిందా! షాకింగ్ నిజాలు

అయితే.. టీఆర్‌‌ఎస్‌ నేతలు ఈ గెలుపును అంత స్థాయిలో చెప్పుకోవడం పైనా రాజకీయ కోణం కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో దుబ్బాక ఉప ఎన్నిక జరుగబోతోంది. ఈ ఉప ఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా తమ ఖాతాలోనే వేసుకోవాలని చూస్తోంది. ఎలాగైతే నిజామాబాద్‌లో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా చేశామో.. ఇక్కడ సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేయాలని ఉవ్విల్లూరుతోంది. అందుకే కవిత గెలుపును ఓటర్లకు వివరిస్తూ డిఫెన్స్‌లో పడేలా చేయాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని నాయకులు గోరంతలు కొండతలు చేస్తూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారన్న చర్చ సాగుతోంది. దుబ్బాక నియోజకవర్గంలో సోలిపేట రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి పనులతో పాటు సెంటిమెంట్‌ కూడా కలిసొస్తుందని పార్టీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచి.. గ్రేటర్‌‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని టీఆర్‌‌ఎస్‌ చూస్తోంది. మరి అధికార పార్టీ ఎత్తుగడలు ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి.