https://oktelugu.com/

KCR vs Tamilsai: కేసీఆర్ వర్సెస్ తమిళ ‘సై’.. తెలంగాణలో ఎవరికీ కలిసి రానుంది?

CM KCR vs Governor Tamilsai: రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతారో ఊహించడం అనేందుకు తెలంగాణ రాజకీయాలే నిదర్శనంగా కన్పిస్తున్నాయి. గత ఏడేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ కి ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగింది. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా మారుతున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో అన్ని పార్టీలు సైతం ముందుగానే అలర్ట్ అవుతూ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2022 10:48 am
    Follow us on

    CM KCR vs Governor Tamilsai: రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతారో ఊహించడం అనేందుకు తెలంగాణ రాజకీయాలే నిదర్శనంగా కన్పిస్తున్నాయి. గత ఏడేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ కి ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగింది. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా మారుతున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో అన్ని పార్టీలు సైతం ముందుగానే అలర్ట్ అవుతూ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నాయి.

    ఇలాంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళ సై మధ్య వివాదం రాజుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ అన్నట్లుగా ఇటీవల జరిగిన ఎన్నికలను బట్టి చూస్తే అర్థమవుతోంది. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ కు గట్టి షాకిచ్చింది.దీంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంలోని బీజేపీని బాదానం చేసి తెలంగాణలో లబ్ధి పొందేలని ప్లాన్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రాన్ని ఇరుకునబెట్టి కొంత పైచేయి సాధించింది. అయితే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రంలో మరోసారి బీజేపీకి తిరుగు ఉండదనే టాక్ విన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం సైతం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

    ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం తెలంగాణ బీజేపీ నాయకులకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య వార్ తెలంగాణలో హాట్ హాట్ గా నడుస్తోంది. కేంద్రంలోని బీజేపీని నేరుగా ఎదుర్కొనే సత్తాలేని టీఆర్ఎస్ నేతలు తెలంగాణ గవర్నర్ తమిళ సై ను అనవసరంగా వివాదాల్లోకి లాగి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారు.

    సీఎం కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వ అధికారులు గవర్నర్ విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదు. గవర్నర్ తెలంగాణలో ఎక్కడ పర్యటనకు వెళ్లినా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజ్యాంగ పదవీలో ఉన్న గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

    గవర్నర్ తమిళ సై తాజాగా ప్రధాని మోదీతో సమావేశమై అయినపుడు కూడా సీఎం కేసీఆర్ వ్యవహర శైలి వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రధాని అపాయిమ్మెంట్ సైతం ప్రయత్నిస్తున్నారు.

    అయితే సీఎం కేసీఆర్ నేరుగా కేంద్రంతో ఢీ కొట్టలేకే గవర్నర్ ను రాజకీయంగా బాదానం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని బీజేపీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. మరోవైపు తమిళ సై సైతం తాను వివాదాస్పద వ్యక్తిని కానని ఫ్రెండ్లీ గవర్నర్ అని చెబుతున్నారు. చట్ట ప్రకారంగానే నడుచుకుంటాననని చెబుతున్నారు. అయితే కేసీఆర్ గవర్నర్ పదవిని వివాదం చేసి రాజకీయంగా వాడుకోవాలని చూస్తే మాత్రం తమిళ సై తానేంటో చూపించే అవకాశం సైతం మెండుగా ఉంది.