Kris Gopalakrishnan Co-founder of Infosys
Kris Gopalakrishnan: ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ సహా మొత్తం 17 మంది వ్యక్తులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయింది. బెంగళూరులోని సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ ఈ కేసును నమోదు చేసింది. కేసును నమోదు చేయించిన డి. సన్నా దుర్గప్ప అనే వ్యక్తి ‘‘భారతీయ విజ్ఞాన సంస్థ (IISc)’’లో సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
ఏం జరిగింది?
ది. సన్నా దుర్గప్ప ఫిర్యాదులో 2014లో తనను ట్రాప్ కేసులో అన్యాయంగా ఇరికించి జాతి వివక్ష కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. తనపై పలు సందర్భాల్లో కులపరమైన అవమానకర వ్యాఖ్యలు చేశారని, మానసికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా క్రిస్ గోపాలకృష్ణన్, IISc మాజీ డైరెక్టర్ బాలరాం సహా మొత్తం 17 మందిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.
దుర్గప్ప ఆరోపణలు
డి. సన్నా దుర్గప్ప కర్నాటకకు చెందిన బోవి తెగకు చెందిన వ్యక్తి. బోవి తెగను బయార్, భోయ్ అని కూడా పిలుస్తారు. ఈ తెగ సామాజికంగా వెనుకబడినవారిగా పరిగణించబడుతుంది. విజయనగర సామ్రాజ్య కాలంలో శిల్ప కళల్లో, నిర్మాణాల్లో ఈ తెగ ఎంతో ప్రాచుర్యం పొందింది. దుర్గప్ప ఆరోపణల ప్రకారం ఐఐఎస్‌సిలో ఉన్న ఉన్నతస్థాయి అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను ఉద్యోగం నుంచి తొలగించారని, పైగా కుల వివక్షతో మరింత మానసిక ఒత్తిడికి గురి చేశారని తెలిపారు.
క్రిస్ గోపాలకృష్ణన్, IISc అధికారుల పై కేసు
దుర్గప్ప ఆరోపణల ఆధారంగా క్రిస్ గోపాలకృష్ణన్, IISc మాజీ డైరెక్టర్ బాలరాం, ఇతర 15 మంది అధికారులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం – 1989
ఎస్సీ/ఎస్టీ చట్టం (SC/ST (Prevention of Atrocities) Act, 1989)ను సమాజంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే దాడులను నిరోధించేందుకు 1989లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1990 జనవరి 30న ఇది అధికారికంగా అమలులోకి వచ్చింది.
* కుల వివక్ష, అవమానం, మానసిక/శారీరక వేధింపులు చేసిన వ్యక్తులకు 6 నెలల నుండి 5 ఏళ్ల వరకు శిక్ష, జరిమానా ఉంటుంది.
* ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించి మరణానికి కారణమైతే, అతనికి మరణదండన కూడా విధించవచ్చు.
కొనసాగుతున్న దర్యాప్తు
ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. క్రిస్ గోపాలకృష్ణన్, IISc అధికారుల నుండి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే, IISc యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసు కర్నాటకలోని దళిత సంఘాల & విద్యార్థి సంఘాల దృష్టిని ఆకర్షించగా, దీనిపై మరిన్ని రాజకీయ, న్యాయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Why sc st cases were registered against 18 people including infosys co founder gopalakrishnan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com