Teenmaar Mallanna: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి లోపల వేయిస్తున్నారు. ప్రభుత్వానికి ఎదురు నిలిస్తే చాలు ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. తీన్మార్ మల్లన్నను చూస్తే తెలుస్తుంది. ఏవో కేసులు పెట్టి ఆయనను గత 33 రోజులుగా జైల్లో పెట్టారు. పైగా ఆయనను విడుదల చేయడానికి వీలు లేకుండా చేస్తూ జైల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నించే గొంతుకలను కట్టేయలేరని సామాజిక మాధ్యమాల ద్వారా పలువరు చెబుతున్నారు.

అయితే తీన్మార్ మల్లన్నను జైలులో కలవాలని భావించినా అనుమతి నిరాకరిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పలుమార్లు ఆయనను కలవాలని వెళ్లినా వీలు పడడం లేదు. పర్మిషన్ లేదని అధికారులు తిప్పి పంపిస్తున్నారు. దీంతో రాష్ర్టంలో ప్రజాస్వామ్యం ఉందా అని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ కూడా తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు.
జ్యోతిష్యుడి కేసులో అరెస్టయిన తీన్మార్ మల్లన్నకు బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టు చేసి రిమాండ్ లో ఉంచడం గమనార్హం. జైలు అధికారుల నిర్లక్ష్యంపై ఎంపీ మండిపడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధికే ఇంటి అవమానం జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తానేదే సంఘవిద్రోహ శక్తిని కలవడానికి వెళ్లడం లేదని చెబుతున్నారు.
తీన్మార్ మల్లన్నను కలవడానికి గత 20 రోజుల్లో నాలుగుసార్లు ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. అయితే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీలో నిలిచి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడి అందరిలో ఉత్కంఠ నిలిపారు. దీంతో అధికార పార్టీ ఆయనపై కక్ష కట్టి మరీ జైల్లో పెట్టించడం గమనార్హం.