Karthika Deepam: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా పిల్లలు తమ తండ్రికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని వెళ్లి బెడ్ రూమ్ లో బెడ్ కింద డబ్బులు కోసం వెతుకుతారు. అదే సమయంలోనే మోనిత ప్రకటన ఉన్నటువంటి పేపర్ ని చూస్తారు. అది చూసిన సౌర్య ఆ పేపర్ తీసుకుని అందులో ఉన్నటువంటి మేటర్ మొత్తం చదివి ఏడుస్తారు. మోనిత ఆంటీ అబద్ధం చెప్పిందేమో అంటూ బాధ పడగా మరోవైపు నిజంగానే డాడీ మోనిత ఆంటీని మోసం చేశాడా అంటూ ఏడుస్తారు .

ఇక సౌందర్య ఇంటికి వచ్చిన తన కూతురు పిల్లలు ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతారు. సౌందర్య వారిని ఇక్కడే ఉండి పొమ్మని చెప్పగా అందుకు పిల్లలు మమ్మీ తొందరగా వచ్చేయ్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అమ్మమ్మ అంటూ చెప్పగా అందుకు ఆనందరావు ఇల్లు పక్కనే అంటున్నారు కదా వెళ్లి పిల్లల్ని వదిలి మనం కూడా అమ్మాయి చూసొద్దాం అంటాడు. అందుకు సౌందర్య దానికి నాపై కోపం మాట్లాడుతుందో లేదో అని అంటూనే తన కూతురు ఇంటికి వెళ్లిపోతారు. ఇక దీపకు పేపర్ విషయం గుర్తుకు వచ్చే ఆ పేపర్ తీసుకోవడం కోసం వెళ్తుంది. అయితే అక్కడ పేపర్ కనిపించకపోయేసరికి ఎంతో కంగారుగా పిల్లలు ఏమైనా పేపర్ తీశారా అంటూ టెన్షన్ పెడుతోంది.
నిజం తెలుసుకున్న సౌర్య, హిమ బాధపడుతూ మెట్లపై కూర్చుని ఉంటారు. అది చూసిన కార్తీక్ వారిని పిలవడంతో వారు వెళ్లక పోయేసరికి కార్తీక్ వెళ్లి వారిద్దరి మధ్యన కూర్చుంటాడు. అలా కార్తీక్ వచ్చి అక్కడ కూర్చునే సరికి పిల్లలు కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళి పోతారు. పిల్లల వెళ్లిపోవడంతో కార్తీక్ ఎంతో బాధగా వారి వంక చూస్తాడు. అంతలో దీపా అక్కడికి రావడంతో సౌర్య హిమని తీసుకుని వెళ్లి పోతుంది. పిల్లలు తనతో మాట్లాడకుండా వెళ్లిపోవడంతో కార్తీక్ బాధపడుతూ పిల్లలు మాట్లాడటం లేదు ఏం జరిగిందో అని బాధ పడగా దీప మనసులో పిల్లలకు నిజం తెలిసింది ఈ విషయం డాక్టర్ బాబు చెప్పకూడదు అని మనసులో అనుకుంది. తర్వాత ఎపిసోడ్ లో దీప జైల్ లో ఉన్నటువంటి మోనితను కలవడానికి వెళ్తూ తనకి బాగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.