Modi Formers: దేశంలో వ్యవసాయ సంస్కరణలను ప్రధాని మోడీ సాహసోపేతంగా అమలు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఉత్తరభారతంలోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు చేసిన ఏడాది నిరసనతో మోడీ తొలిసారి వెనకడుగు వేశారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పారు. రైతుల కోరికలపై పూర్తిగా మోడీ దిగివచ్చాడు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైతు కథ దేశంలో మారలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వ్యవసాయ సంస్కరణలు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ ధైర్యాన్ని మోడీ సర్కార్ చేసింది. కానీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. పంజాబ్, ఉత్తరప్రదేశ్ లు బీజేపీకి అత్యవసరమైన రాష్ట్రాలుగా ఉండడంతో ఎన్నికల కోసం మోడీ ఈ రైతు చట్టాలను వెనక్కి తీసుకొని కాంప్రమైజ్ అయ్యాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దేశంలోని పాలకులకు పట్టు విడుపులు ఉండాలి. కానీ రైతుల ధోరణి, వ్యవహారశైలి, ఆందోళనలను చూసి కూడా మోడీ సర్కార్ వెనకేసుకురావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎర్రకోటపై దాడి చేసినా.. రహదారులు, రైళ్లు మూసేసినా.. సాగుచట్టాలు వెనక్కి తీసుకున్నా కూడా రైతుల ధోరణిలో సానుకూలత రాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇక ఎర్రకోటపై దాడులు చేసిన రైతులపై కేసులను వెనక్కి తీసుకొని స్వేచ్ఛగా వదిలేయడం.. వారి ఒత్తిడికి తలొగ్గడం చూస్తుంటే అది నిరసనకారులకు బలాన్ని ఇచ్చేలా కనిపిస్తోంది. ఇదే మోడీ సర్కార్ వైఫల్యంగా చెప్పొచ్చని మేధావులు అంటున్నారు.
Also Read: ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అవసరం ఎంత ఉంది?
సంస్కరణలు అనేవి పూర్తిగా పక్కనపెట్టడం.. రైతుల కోరికలను ఆమోదించడం పెద్ద తప్పుగా చెప్పొచ్చు. వాతావరణ కాలుష్యం తగ్గింపుపై మోడీ సర్కార్ వెనకడుగు, శాంతిభద్రతలపై మోడీ సడలింపులు విమర్శలకు తావిచ్చింది.
మోడీ ఒక బలమైన నిర్ణయం తీసుకుంటే వెనక్కి పోడనే పేరుంది. కానీ రైతుల విషయంలో మోడీ ఎన్నికల కోసం ఎంతవరకైనా బెండ్ అవుతాడని అర్థమవుతోంది. ఎన్నికలు, అధికారం మోడీకి ముఖ్యమా? దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే సంస్కరణలు ముఖ్యమా? అంటే మోడీ ఎన్నికలకే ఓటేశాడు. సంస్కరణలకు పాతరేశాడు. ఇక్కడ మోడీ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. మోడీ రైతుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ‘రామ్ టాక్’ స్పెషల్ వ్యూ పాయింట్ ను కింది వీడియోలో చూడొచ్చు.