Jallikattu: జల్లికట్టుకు తమిళనాడులో ఎందుకు అంత ప్రాధాన్యం.. ఎద్దుల అదుపు చేసే క్రీడ ప్రపంచ దృష్టిని ఎలా ఆకర్షించింది..

జల్లికట్టు ఆటలో ఎద్దులు హింసకు గురవుతున్నాయని, నిషేధం విధించాలని కోరుతూ పెటాతో పాటు జంతు ప్రేమికులు కోర్టు ఎక్కారు. దీంతో 2014లో కోర్టు నిషేధించింది. దీనిపై తమిళనాడులో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

Written By: SHAIK SADIQ, Updated On : May 22, 2023 9:37 am

Jallikattu

Follow us on

Jallikattu: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జల్లికట్టు మరల వార్తల్లో నిలిచింది. తమిళనాట ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఆటను ఆడేందుకు ఎంతోమంది యువకులు సిద్ధంగా ఉంటారు. గెలిచిన వారిని హీరోలుగా పరిగణిస్తారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ ఆటను ఆడాలంటే ఎంతో నియమ నిష్టలను పాటించాల్సి ఉంటుంది. అసలు ఈ ఆటకు ఎందుకంత క్రేజ్ ఉందో తెలుసుకుందాం.

ఎద్దులను లొంగదీసుకునేందుకు..

పొంగల్ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబల, మహారాష్ట్రలో ఎడ్లబడ్ల పోటీలను నిర్వహిస్తుంటారు. ఎద్దులను వదిలి వాటిని తరుముతూ మజ్జిగ చేసుకోవడం ఆట ప్రధాన ఉద్దేశం. ఎంతో బలిష్టమైన ఆ ఎద్దుల కొమ్ములను వంచి తమ ప్రతిభను, ధైర్య సాహసాలను ప్రదర్శించేందుకు ఎంతో మంది యువకులు క్యూ కడతారు. దాదాపుగా వెయ్యి సంవత్సరాలు పైబడి ఈ ఆటను నిర్వహిస్తున్నట్లు ప్రాచీన ఆధారాలు ఉన్నాయి.

జల్లికట్టు అంటే..

మొదట్లో జల్లికట్టును తల్లికట్టుగా పిలిచేవారు. క్రమేణ ఇది జల్లికట్టుగా మారినట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. జల్లికట్టు అనే పదం కల్లి అంటే నాణెం, కట్టు అనే పదాల నుంచి వచ్చినట్లు చాలామంది అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో ఎద్దుల కొమ్ములకు వస్త్రాలు చుట్టి అందులో నాణేలను కట్టేవారు. పోటీల్లో గెలిచిన వారికి ఆ నాణేలను ఇచ్చేవారు. ఆ తర్వాత సాహస క్రీడగా పేరుగాంచడంతో, విజేతలకు పిల్లను కూడా ఇస్తామని కొంతమంది ప్రకటనలు చేసేవారు. ఆ తర్వాత రాను రాను బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. పంచెలు, టిఫిన్ బాక్సులు, వెండి గిన్నెలు, చొక్కాలు ఇచ్చేవారని ఇక్కడివాసులు చెబుతున్నారు. ప్రస్తుతం కార్లు, బైకులు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఇస్తున్నారు.

నిషేధం తర్వాత మరింత ప్రాచుర్యం

జల్లికట్టు ఆటలో ఎద్దులు హింసకు గురవుతున్నాయని, నిషేధం విధించాలని కోరుతూ పెటాతో పాటు జంతు ప్రేమికులు కోర్టు ఎక్కారు. దీంతో 2014లో కోర్టు నిషేధించింది. దీనిపై తమిళనాడులో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు ఆటను సమర్థిస్తూ చట్టాలను తీసుకొచ్చింది. జల్లికట్టు తమ సంస్కృతిలో భాగమని ప్రాచీన కాలం నుంచి వస్తుందని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. పెరు, కొలంబియా, స్పెయిన్ వంటి దేశాలు ఎద్దుల పోటీలను సాంస్కృతిక వారసత్వంలో భాగంగా పరిగణిస్తున్నాయని తెలిపింది. కేవలం వినోదపరంగానే కాకుండా గొప్ప చారిత్రాత్మక సాంస్కృతిక మతపరమైన విలువలను కలిగిన ఆటగా జల్లికట్టును భావిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. సమర్థించిన జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. జల్లికట్టు నిర్వహించుకోవచ్చు అని పేర్కొంది.

ప్రముఖుల రాక

ప్రాచుర్యం పొందిన జల్లికట్టు కట్టడం చూడడానికి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు హాజరవ్వడంతో ప్రపంచ దుస్థితిని ఆకర్షించింది. 2021 లో అప్పటి ముఖ్యమంత్రి పలని స్వామి డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ వేడుకలకు హాజరయ్యారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో పాటు డీఎంకే నాయకుడు ఉదయనిది స్టాలిన్ కూడా అవనీయపురంలో జరిగిన జల్లికట్టును చూసేందుకు వచ్చారు. క్రమేనా విదేశీయులు రాజకీయ నాయకులు జల్లికట్టును ఇష్టపడుతుండటంతో స్పాన్సర్ల నుంచి నిధులు రావడం మొదలయ్యాయి.

ఎంతో నిష్టగా ఉండాలి

జల్లికట్టు ఆటలో పాల్గొనేవారు ఎంతో నిష్టగా ఉండాలి. చెడు అలవాట్లను దూరంగా ఉంటారు. ఎందుకంటే శారీరక దృఢత్వం అనేది చాలా ముఖ్యం. శారీరక దృఢత్వం అవసరం. ఇందులో పాల్గొనేవారు నెల రోజుల నుంచి భక్తితో ఉపవాసం ఉంటారు. బహుమతుల కోసం కాకుండా ప్రతిభ పరాక్రమాలను నిరూపించుకునే వేదికగా వారు భావిస్తారు. గెలిచిన వారిని హీరోల్లా ఇక్కడి వారు చూస్తారు. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఈ సారి వేడుకలను గ్రామాల్లో రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించేందుకు నిర్వాహకులు సంసిద్ధమవుతున్నారు.