India Map: భారత చిత్రపటంలో శ్రీలంక దేశం మ్యాప్ ఎందుకు ఉంటుంది? అందుకు కారణం ఏంటి?

ఈ సందర్భంగా భారత్ గురించి కొనియాడారు. ఈ సందర్భంగా భారతదేశం మ్యాప్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తి చర్చ సాగుతోంది. భారతదేశం పటంలో భారత్ తో పాటు కింద శ్రీలంక కూడా కచ్చితంగా కనిపిస్తుంది.

Written By: Chai Muchhata, Updated On : September 27, 2023 2:24 pm

India Map

Follow us on

India Map: ప్రపంచంలోని మిగతా దేశాల కంటే భారత దేశానికి ప్రత్యేక ఆకారం ఉంటుంది. మన దేశ చిత్రపటాన్ని ఒక్కసారి చూస్తే ఎవరూ మర్చిపోరు. ఒక ప్రత్యేక ఆకారాన్ని రూపుదిద్దుకున్న భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలతో వివిధ రంగాలతో పోటీ పడుతోంది. ఇటీవల జీ 20 సమావేశాల సందర్భంగా వివిధ దేశాధినేతలు భారత్ ఆతిథ్యం పొందారు.

ఈ సందర్భంగా భారత్ గురించి కొనియాడారు. ఈ సందర్భంగా భారతదేశం మ్యాప్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తి చర్చ సాగుతోంది. భారతదేశం పటంలో భారత్ తో పాటు కింద శ్రీలంక కూడా కచ్చితంగా కనిపిస్తుంది. మిగతా దేశాలు కనిపించవు. అలా శ్రీలకం దేశం భారతదేశ పటంలో ఎందుకు చోటు సంపాదించుకుంది? అందుకు గల కారణం ఏంటి?

భారత్, శ్రీలంకల మధ్య నిత్యం రాకపోకలు సాగుతాయి. ఈ రెండు దేశాల మధ్య రోడ్డు మార్గం లేదు. కేవలం వాయు, జల మార్గాల ద్వారానే ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది. రామాయణ కాలంలో భారత్, శ్రీలంకల మధ్య రామసేతు నిర్మించారన్న వాదనపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ‘రామసేతు’ అనే సినిమా కూడా వచ్చింది. దీంతో భారత్ , శ్రీలంకల మధ్య మెరుగైన సంబంధాలు ఉన్నాయని అందరికీ అర్థమైంది. అయితే ఎంత మిత్ర దేశమైనా భారత్ చిత్ర పటంలో వేరే దేశానికి సంబంధించిన మ్యాప్ ఎందుకు ఉంటుంది?

భారత్ మ్యాప్ లో శ్రీలంక మ్యాప్ ఉండడానికి అంతర్జాతీయంగా కారణం ఉంది. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం తరువాత యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యూఎన్సీఎల్ ఓసీ -1) కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆ తరువాత 1958 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఈ సమావేశంలో సముద్రానికి సంబంధించిన సరిహద్దులు, ఒప్పందాలు నిర్వహించుకున్నారు. ఈ చట్టం ప్రకారం ఒక దేశం సముద్ర తీరాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ దేశ సరిహద్దు చుట్టూ ఉన్న దేశాన్ని కూడా దేశ మ్యాప్ లో చూపించాలని నిర్ణయించారు.

ఆ దేశ సరిహద్దులోని 200 నాటికల్ మైళ్ల దూరం అంటే 370 కిలోమీటర్లలో ఏ ప్రాంతం ఉన్నా.. దానిని గుర్తించాలి. భారతదేశానికి దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రంలో శ్రీలంక దేశం ఉంది. ఈ దేశం భారత్ సరిహద్దులోని 18 మైళ్ల దూరంలో ఉంది. అందుకే శ్రీలంక మ్యాప్ ను భారత చిత్రపటంలో తప్పనిసరిగా చూపిస్తారు. ఇలా భారత్ కు దక్షిణాన కచ్చితంగా శ్రీలంకను చేర్చారు.