సుందరమైన ప్రాంతం అంటే కశ్మీరం గుర్తొస్తోంద. దేశంలో పర్యాటక ప్రాంతాల్లో కనువిందు చేసే జలపాతాలు, ఆహ్లాదపరచే వృక్షాలు ఆనందం గొలుపుతాయి. శీతాకాలంలో కాశ్మీర్ కు వెళితే ఆ ఆనందమే వేరు. కశ్మీర్ నుంచి లడ్డాఖ్ వరకు ఏడు నెలల పాటు మంచుతో కప్పడంతో రాకపోకలు నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో చైనా, పాకిస్తాన్ సరిహద్దులను పంచుకునే లడ్డాఖ్ పొరుగుదేశాల వ్యూహాత్మక ఎత్తుగడలను నిలువరించి దేశ రక్షణకు తోడ్పడుతున్నాయి.

శ్రీనగర్ నుంచి లడ్డాఖ్ మార్గంలో నిర్మిస్తున్న రెండు సొరంగ మార్గాలతో రాష్ర్ట ప్రతిష్ట మరింత పెరగనుంది. కాళేశ్వరం పథకంలో పనులు వేగంగా నిర్వహించిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆసియాలోనే పెద్దదైన జోజిలా సొరంగం పనులు చేపడుతోంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పనులు మంగళవారం సందర్శించనున్నారు. సోన్ మార్గ్ లో సోమవారం మీడియా సమావేశంలో జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు గుర్జిత్ సింగ్ కాంబో దీని వివరాలు తెలిపారు.
శ్రీనగర్ నుంచి లేహ్, డ్రాన్, కార్గిల్, లడ్డాఖ్ లను కలిపే మార్గంలో జడ్ మోర్, జోజిలా సొరంగాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కశ్మీర్ మరింత సుందరంగా మారుతుంది. రక్షణకు కూడా తోడ్పడుతుంది. ప్రయాణ భారాన్ని తగ్గించే క్రమంలోనే వీటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీనగర్ నుంచి లడ్డాఖ్ వరకు ఆరు వరసల రహదారి నిర్మాణానికి ఇవి కీలకంగా మారనున్నాయి.
సొరంగాల నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలు వినియోగిస్తున్నారు. కొత్తగా వచ్చిన సాంకేతికతను ఉపయోగిస్తూ బ్లాస్టింగ్స్ నిర్వహిస్తున్నారు. సొరంగ మార్గాల్లో భవిష్యత్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రమాదాలు ఏర్పడినా ఎలాంటి ప్రాణముప్పు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.