KTR- Tank Bund Shiva: ట్యాంక్ బండ్ శివ గురించి అందరికి తెలుసు. హుస్సేన్ సాగర్ పక్కన చిన్న గుడిసె వేసుకుని జీవనం సాగించే శివ అందులో పడి ఆత్మహత్యాయత్నం చేసే వారిని ఎందరినో కాపాడాడు. ఇంకా అందులో పడి చనిపోయిన వారిని కూడా బయటకు తీసేవాడు. ఇలా తన జీవితం సాగర్ పక్కనే గడిచేది. ఈ నేపథ్యంలో పలు టీవీ చానళ్లు, పత్రికలు అతడి జీవనస్థితిగతులపై ప్రసారాలు చేయడంతో మంత్రి కేటీఆర్ చలించి అతడికి నెక్లెస్ రోడ్ లో నిర్మించే డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఓ ప్లాట్ కేటాయించారు. దీంతో కేటీఆర్ శివకు దేవుడయ్యారు.

దీంతో గృహప్రవేశం సమయంలో కేటీఆర్ రావాలని ఆశించినా కుదరలేదు. తనకు నివాసస్థలం కేటాయించిన కేటీఆర్ తన ఇంటికి రావాలని శివ ఉత్సాహంతో ఉన్నాడు. ఈ మేరకు తన మదిలో కోరిక బయటపెట్టడంతో కేటీఆర్ కూడా అందుకు సరే నని చెప్పడంతో శివ సంతోషానికి అవధులు లేవు. తనకు నీడనిచ్చిన దేవుడు తన ఇంటికి వస్తున్నాడంటే పండగే అన్నట్లు చెబుతున్నాడు. అసలు కేటీఆర్ ఉద్దేశం ఏంటి? శివ ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు? ఇందులో ఏదైనా మర్మం ఉందా? లేక రాజకీయ కోణం దాగి ఉందా? అని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఇటీవల కాలంలో టీఆర్ఎస్ కొత్త కోణాల్లో రాజకీయాలు చేస్తోంది. శివ వ్యవహారంలో కూడా ఏదైనా రాజకీయ ఉద్దేశం ఉందేమోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. శివ పేదవాడే ఎవరు కాదనరు. తనకు డబుల్ బెడ్ రూం ఇవ్వడానికి అర్హుడే. కానీ ఇందులో ఏదైనా రాజకీయ కోణం ఉందేమోననే వాదన కొందరిలో వస్తోంది. ఈ మధ్య టీఆర్ఎస్ పార్టీ ప్రతి దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తోంది. అందుకు పలు సంఘటనలు కూడా రుజువు చేశాయి. ఈ నేపథ్యంలో శివ ఇంటికి వెళ్లాలని కేటీఆర్ నిర్ణయించుకోవడం సందేహాలకు తావిస్తోంది.

అభాగ్యులను ఆదుకోవడం సర్కారు లక్ష్యమే. గూడు, గుడ్డ లేని వారిని అక్కున చేర్చుకుని వారికి చేయూతనివ్వడం నిజంగా ఆహ్వానించదగినదే. శివ విషయంలో కేటీఆర్ మంచే చేస్తున్నారు. అతడికి గూడు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో అతడు మంత్రిని ఆరాధిస్తున్నారు. కేటీఆర్ అంటే భక్తిభావం పెంచుకున్నాడు. తనకు డబుల్ బెడ్ రూం ఇచ్చిన దేవుడుగా కొలుస్తున్నాడు. తన మనసులో ఎంతో భక్తి కలిగి ఉన్నాడు. అలాంటి మంత్రి తన ఇంటికి వస్తున్నాడని సంబరపడిపోతున్నాడు.