Vangaveeti Radhakrishna, Pawan Kalyan: వంగవీటి రాధాకృష్ణ.. తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. వంగవీటి మోహన్ రంగా వారసుడిగా తెరపైకి వచ్చి 25 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుపున అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు తరువాత రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, దూకుడు స్వభావం, తొందర పాటుతో దాదాపు 15 సంవత్సరాలు పవర్ కు దూరమయ్యారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నా అంత యాక్టివ్ గా లేరు. క్రీయాశీలక రాజకీయాలకు మాత్రం దూరంగా ఉన్నారు. అయితే ఆయన మరోసారి యాక్టివ్ అవుతారని టాక్ నడుస్తోంది. జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన జనసేనకు దగ్గరయ్యే చాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్టివ్ పొలిటిషియన్ కాకపోయినా..తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని ఆయన సక్రమంగా వాడుకోలేదన్న అపవాదు అయితే ఉంది. అయితే మరోసారి ఆ తప్పిదం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
కలిసిరాని కాలం…
2004లో రాధా రాజకీయ అరంగేట్రం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. నాడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీని వీడొద్దని సూచించినా పట్టించుకోలేదు. పీఆర్పీలో చేరి మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఓటమి చవిచూశారు. అనంతర పరిణామాల నేపథ్యంలో పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినా.. రాధా మాత్రం దూరంగా ఉండిపోయారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు. జగన్ కూడా రాధాకు మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. పార్టీ బాధ్యతలను అప్పగించారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఓటమితో సంబంధం లేకుండా జగన్ ప్రాధాన్యమిచ్చినా రాధా వాడుకోలేదన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది.
నాడు పొమ్మనలేక పొగ..
అయితే వైసీపీలో రాధా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తనకిష్టమైన విశాఖ తూర్పు నుంచి పోటీచేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ 2019 ఎన్నికల్లో రాధాకు చుక్కెదురైంది. తూర్పు సీటు కాకుండా ఎంపీగా పోటీచేయాలని అధిష్టానం సూచించింది. దీంతో విభేదించి రాధా పార్టీని వీడారు. నాడు బొత్స, విజయసాయిరెడ్డి వారు బుజ్జగించినా వినలేదు. సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీని వీటి టీడీపీలో చేరారు. టీడీపీ ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. కానీ నాటి ఎన్నికల్లోటీడీపీ ఓటమి చవిచూసింది. దీంతో రాధా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. యాక్టివ్ పొలిటిక్స్ ను తగ్గించారు. అయితే ఇటీవల తనపై హత్యాప్రయత్నానికి రెక్కి జరిగిందని రాధా ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో చంద్రబాబు పరామర్శించిన ఉదాంతాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పవర్ పాలిటిక్స్ కు దూరం…
దాదాపు 15 సంవత్సరాల పాటు పవర్ పాలిటిక్స్ కు దూరమైన రాధా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అందుకే ఈసారి ఆచీతూచీ అడుగులు వేయనున్నారు. జనసేన వర్గాలు మాత్రం రాధాను పార్టీలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఆయన అభిమానులు మాత్రం అన్ని కులంకుషంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్నారు. అటు జనసేనకు కూడా క్రియాశీలక నాయకత్వం భర్తీ కావాల్సిన అవసరముంది. అందుకే రాధా జనసేన వైపు మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే రాధా నేరుగా ఎన్నికల్లో పోటీచేసే అవకాశం తక్కువ అని తెలుస్తోంది. కూటమి ప్రచార బాధ్యతలు తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం.

వంగవీటి రాధాకృష్ణ.. తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. వంగవీటి మోహన్ రంగా వారసుడిగా తెరపైకి వచ్చి 25 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుపున అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు తరువాత రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, దూకుడు స్వభావం, తొందర పాటుతో దాదాపు 15 సంవత్సరాలు పవర్ కు దూరమయ్యారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నా అంత యాక్టివ్ గా లేరు. క్రీయాశీలక రాజకీయాలకు మాత్రం దూరంగా ఉన్నారు. అయితే ఆయన మరోసారి యాక్టివ్ అవుతారని టాక్ నడుస్తోంది. జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన జనసేనకు దగ్గరయ్యే చాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్టివ్ పొలిటిషియన్ కాకపోయినా..తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని ఆయన సక్రమంగా వాడుకోలేదన్న అపవాదు అయితే ఉంది. అయితే మరోసారి ఆ తప్పిదం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.