YCP: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తోంది. కానీ దానికి కారకులను గుర్తించడంలో వెనకడుగు వేస్తోంది. దీంతో అసలు వైసీపీకి బీజేపీ మిత్ర పక్షమా? లేక ప్రతిపక్షమా? అనే ప్రశ్న అందరిలో వ్యక్తమవుతోంది. ఏదో చేసుకుంటే చేసుకోనీలే అనే విధంగా బీజేపీ చూసీచూడనట్లుగా ప్రవర్తిస్తోందని తెలుస్తోంది. దీంతో బద్వేల్ లో బీజేపీ వ్యవహార శైలి ఏమిటన్నది ఎవరికి అర్థం కావడం లేదు.

ఇక తిరుపతిలో కూడా గతంలో జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ దొంగ ఓట్లు వేయించినా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ ఏం చేయలేకపోయింది. దీంతో వైసీపీ విషయంలో బీజేపీ కరుకుదనంగా ఉండటం లేదన్నది తెలుస్తోంది. దానికి వంత పాడేందుకు నిర్ణయించుకున్నట్లు పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తోంది. తిరుపతిలో కర్ణాటకలోని రిటైర్డ్ ఐఏఎస్ ను తీసుకొచ్చి బీజేపీ పోటీ చేయించినా పోటీలో నిలవలేకపోయింది.
బద్వేల్ లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా అధికార పార్టీ వైసీపీ దొంగ ఓట్లు వేయించుకోవడంలో ఎందుకు ఉత్సాహం చూపించిందనేది అందరిలో ఎదురవుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ విధానాన్ని ఎండగట్టినా ప్రత్యక్షంగా మాత్రం ఎలాంటి చర్యలకు పూనుకోలేదు. దీంతో వైసీపీపై బీజేపీ సానుకూలంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Huzurabad: హుజూరాబాద్ పోరులో ఆ సైలెంట్ ఓట్లే కీలకం
నలభై మంది మహిళలను దొంగ ఓట్లు వేయించడానికి తీసుకొచ్చినా వారిపై ఏ రకమైన చర్యలు తీసుకోలేదు వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. దీంతో అధికార పార్టీ ఆగడాలకు అడ్డు చెప్పే వారు ఎవరు లేకపోవడం దానికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. దీంతో ఏపీలో బీజేపీ, వైసీపీ మధ్య ఏదో ఒప్పందం జరిగి ఉంటుందని అందరిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: MLC polls: వైసీపీకి వరం: కొత్తగా 14 మంది ఎమ్మెల్సీలు.. ముగ్గురు ఖరారు.. లిస్ట్ ఇదే