CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తున్నాయి. దీంతో జగన్ సర్కారుకు సంకటంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలతో జగన్ దూసుకుపోతున్నా ప్రతిపక్షాలు మాత్రం తమ వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ సైతం తన కాంక్ష పెంచుకుంటోంది. వైసీపీని ఎలాగైనా అధికారం నుంచి తప్పించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఏపీలో వైసీపీ సర్కారు మూడు రాజధానుల వ్యవహారంతో అరకాటంలో పడినట్లు అయింది. ఇప్పుడు అమరావతి రాజధాని కోసం ధర్నా చేస్తున్న రైతులు అక్కడి నుంచి సచివాలయానికి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సుమారు 200 మంది రైతులు తమ డిమాండ్ల సాధనకు నడుం కట్టడంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు మైనింగ్ మాఫియా సైతం అధికార పార్టీకి మింగుడుపడటం లేదు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కూడా ఇప్పుడు వైసీపీకి కష్టాలే తెచ్చిపెట్టేలా ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీని కాదని వైసీపీని టార్గెట్ చేసుకుని జనసేన పోరాటం చేస్తున్న క్రమంలో ప్లాంట్ పై తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జగన్ ఇటు చెప్పలేక అటు నో అన లేక నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారయింది పరిస్థితి.
మూడు రాజధానుల వ్యవహారం కోర్టులో పెండింగ్ లో ఉండటంతో దానిపై కూడా వైసీపీకి తంటాలే ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అటు అమరావతి ఉద్యమం, ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లో జగన్ తిప్పలు పడే అవకాశం కనిపిస్తోంది. ఒక వైపు రైతులు మరోవైపు కార్మికులు జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేందుకు సిద్ధమవుతున్నారు. ః
Also Read: MLC polls: వైసీపీకి వరం: కొత్తగా 14 మంది ఎమ్మెల్సీలు.. ముగ్గురు ఖరారు.. లిస్ట్ ఇదే
తెలంగాణ ప్రజా సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సైతం విశాఖ స్టీల్ పై స్పందించేందుకు సిద్ధమయ్యారు. పాలకులపై ప్రశ్నలు కురిపించేందుకు నడుం కట్టారు దీంతో జగన్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ మరో సమస్య కానుంది. కానీ జగన్ ఏ మేరకు వీటి నుంచి బయటపడతారో వేచి చూడాల్సిందే.
Also Read: Huzurabad: హుజూరాబాద్ పోరులో ఆ సైలెంట్ ఓట్లే కీలకం