https://oktelugu.com/

Chetna Chakravarthy: భారతీయ మగాళ్లు ఆ పని చేయలేరు.. మహిళా కోచ్ సంచలన కామెంట్స్: వైరల్ వీడియో

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలో లైఫ్ కోచ్ గా పేరుపొందిన చేతనా చక్రవర్తి తన మాటలతో సంచలనం సృష్టించారు. ఆ వీడియోలో చేతన భారతీయ పురుషుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.."భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. వసుదైక జీవనానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి దేశంలో పురుషులు కాస్త భిన్నంగా ఉంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 26, 2024 / 12:19 PM IST

    Chetna Chakravarthy

    Follow us on

    Chetna Chakravarthy: అరచేతిలో ప్రపంచం ఇమిడిపోతున్న రోజులవి. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న రోజులు కూడా ఇవే. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందనేది ఇట్టే తెలుసుకునే సౌకర్యం సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనకు కలుగుతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్పులు చోటు చేసుకుంటుండడంతో సరికొత్త సౌలభ్యాలు మన సొంతమవుతున్నాయి. అధునాతనమైన జీవనశైలి మనకు అందుబాటులోకి వస్తోంది. అయితే ఇలాంటి రోజుల్లోనూ మన దేశంలో బహిరంగంగా శృంగారం గురించి చర్చించుకోవడం సాధ్యం కావడం లేదు. కాలం మారుతున్నప్పటికీ.. కాలంతో పాటు మనం కూడా మారాలనే పాటలు తరచూ వినిపిస్తున్నప్పటికీ.. శృంగారం అనేది ఇప్పటికీ నిషిద్ధమైన పదమే అయిపోయింది. పరిస్థితులు వేగంగా మారుతున్నప్పటికీ మనదేశంలో కూడా శృంగారం గురించి నేరుగా చర్చించుకునే అవకాశం లేదు. సహజీవనం, డేటింగ్ వంటి అధునాతన సాంస్కృతి మనదేశంలోకి వచ్చినప్పటికీ శృంగారం గురించి అంత లోతైన చర్చ జరగడం లేదు. పైగా అనేక కట్టుబాట్లు ఆ విషయంలో ముందస్తు జ్ఞానాన్ని తర్వాతి తరం వారికి తెలియకుండా చేస్తున్నాయి. ఇందులో ఎవర్నీ తప్పు పట్టడానికి లేకపోయినప్పటికీ.. ఇలాంటి విషయాల్లో ఆశించినంత ముందడుగు పడడం లేదు. సంప్రదాయ కుటుంబాలు, రకరకాల నిబంధనలు, సంస్కృతి వంటివి శృంగారం విషయంలో బహిరంగంగా మాట్లాడేందుకు అడ్డుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ మహిళ కోచ్ చేసిన కామెంట్స్ సంచలనం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని పురుషల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

    సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలో లైఫ్ కోచ్ గా పేరుపొందిన చేతనా చక్రవర్తి తన మాటలతో సంచలనం సృష్టించారు. ఆ వీడియోలో చేతన భారతీయ పురుషుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు..”భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. వసుదైక జీవనానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి దేశంలో పురుషులు కాస్త భిన్నంగా ఉంటారు. వారి వ్యవహార శైలి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఇంతటి ఘనమైన మూలాలు కలిగి ఉన్నప్పటికీ వారు ఎందుకు అలా ప్రవర్తిస్తారో అస్సలు అర్థం కాదు. అందువల్లే భారతదేశానికి చెందిన పురుషులతో ఎట్టి పరిస్థితిలో డేటింగ్ చేయకూడదని” చేతన పేర్కొన్నారు. భారతీయ పురుషులతో ఎందుకు డేటింగ్ చేయకూడదో అనే విషయాన్ని కారణాలతో వివరించారు చేతన.

    ” మొదటి కారణం; భారతదేశంలో పురుషాధిక్య సమాజం కొనసాగుతోంది. అందువల్లే మహిళలకు పురుషులు ఏమాత్రం గౌరవం ఇవ్వరు. గౌరవం లేకుండానే పిలుస్తారు..

    రెండవ కారణం: ఏదైనా సమస్య తలెత్తితే.. దాని గురించి ఒక మహిళ మాట్లాడితే.. దానికి స్పందించకుండా.. మగవాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు. ఇదే సమయంలో ఆమెకు గయ్యాళి అని పేరు పెడతారు. ఆమెకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా వదరబోతు అనే బిరుదును ఇచ్చేస్తారు.

    మూడవ కారణం: భారత దేశ పురుషులకు శృంగారం అంటే ఏంటో తెలియదు. అసలు వారికి దానిపై ఏమాత్రం అవగాహన లేదు. ఎటువంటి ఆసక్తిని చూపించకుండా మొరటుగా వ్యవహరిస్తారు. శృంగారం అంటే వారి దృష్టిలో నెలకు ఒక డిన్నర్ డేట్ అని మాత్రమే తెలుసు. అందువల్లే భారతీయ పురుషులతో నేను ఎట్టి పరిస్థితుల్లో డేటింగ్ చేయనని” చేతన ప్రకటించింది.

    ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో.. చాలామంది రెస్పాండ్ అయ్యారు. “నువ్వు భారతీయ మహిళవు. భారతీయులంటే నీకు గౌరవం ఉండాలి. భారతీయత అంటే శృంగారం మాత్రమే కాదు. ఇక్కడి పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు నీకు తెలిసినట్టు లేవు. అందుకే ఏదేదో వాగుతున్నావు.. దయచేసి మీ వ్యవహార శైలి మార్చుకో.. ఇది పద్ధతి కాదంటూ” కొంతమంది ఆమెకు కౌంటర్ ఇచ్చారు. మరి కొంతమంది ఆమె చెప్పిన వ్యాఖ్యలతో ఏకీభవించారు. వాస్త విషయాన్ని చెప్పారంటూ ప్రశంసించారు. ఇలాంటి విషయాలు చెప్పాలంటే గుండె ధైర్యం ఉండాలని, అది మీకు మెండుగా ఉందని చేతనను అభినందించారు.