YCP Leaders: వైసీపీకి ఇప్పుడు హామీల భయం పట్టుకుంది. గతంలో ఇచ్చిన హామీలతోనే కుదేలవుతున్న సందర్భంలో కొత్తగా హామీలిస్తే వాటిని నెరవేర్చడం కత్తిమీద సామే అని చెప్పాలి. అందుకే కొత్త వాటిపై అప్రమత్తంగా ఉండేందుకు చూస్తోంది. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హామీలిస్తే వాటిని మించి ఇవ్వాల్సి వస్తుందని ఆలోచనలో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో 2024 నాటి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్న టీడీపీని ఎదుర్కోవడం ఎలా అనే ఆలోచనలో వైసీపీ పడిపోయింది. దీంతో బాబు చేసే వాగ్దానాలను మించి చేసేందుకు సిద్ధమవుతోంది.
అయితే జగన్ అధికారంలోకి రావడానికి అప్పుడు ఇచ్చిన హామీలే అని తెలుస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలో కి రావాలని హామీలిచ్చినా ప్రజలు విశ్వసించలేదు. 2014లో మాత్రం బాబుపై విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించినా వాటిని నెరవేర్చేందుకు ఆయన సైతం కష్టపడాల్సి వచ్చింది. ఇక జగన్ కూడా హామీల పరంపరతోనే అధికారం చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హామీలకు ఉన్న డిమాండ్ ఏపీలో ఎక్కువే అని తెలుస్తోంది. అందుకే రెండు పార్టీలు ఏ మేరకు హామీలు కురిపిస్తాయో వేచి చూడాల్సిందే.
సీఎం జగన్ నవరత్నాలు పేరుతో పరిపాలన సాగిస్తున్నారు. దీంతో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు కొత్తగా హామీలిస్తే వాటిని తలదన్నే విధంగా అధికార పార్టీ కూడా హామీలు ఇవ్వకతప్పదు. దీంతో ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా నగదు బదిలీ చేయాల్సిందే. ఈ క్రమంలో జగన్ తో పాటు వైసీపీ నేతలంతా బెంగతో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఓటర్లు టీడీపీ వైపు మొగ్గితే పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డారు. ఒకవేళ టీడీపీ హామీలు నచ్చి అటు వైపు మళ్లితే పరిస్థితి ఎలా ఉంటుందో అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పింఛన్లలో కోత విధించారు. గతంలో పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చినా దాన్ని నెరవేర్చలేదు. దీంతో వైసీపీలో భయం పట్టుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు కొత్తగా ఇచ్చే హామీలపైనే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.