Homeఆంధ్రప్రదేశ్‌Sharmila- Jagan: జగన్ తో ఈ విషయంలో షర్మిళ ఎందుకు విభేదించినట్టు?

Sharmila- Jagan: జగన్ తో ఈ విషయంలో షర్మిళ ఎందుకు విభేదించినట్టు?

Sharmila- Jagan: వైఎస్ షర్మిళ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారా? పొలిటికల్ స్ట్రాటజీకి అనుగుణంగా అడుగులు వేస్తున్నారా? సోదరుడు ప్రోత్సాహంతో పార్టీ పెట్టారన్న అపవాదును తొలగించే ప్రయత్నం చేస్తున్నారా? తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులకు దగ్గరయ్యేందుకు కొత్త పల్లవి అందుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల నుంచి ఇదే సమాధానం వస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని షర్మిళ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తన తండ్రి పేరు పెట్టినా ఆమె హర్షం వెలిబుచ్చలేదు. తన సోదరుడు జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టిన తరువాత ఆమె ఏపీ ప్రభుత్వ చర్యలను ఎప్పుడూ తప్పుపట్టలేదు. నేరుగా విమర్శలు చేయలేదు. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో గట్టిగానే స్పందించారు. అయితే అది వ్యూహాత్మకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని ఎన్టీఆర్ అభిమానులు కనెక్ట్ అయ్యేందుకునేని టాక్ నడుస్తోంది.

Sharmila- Jagan
Sharmila- Jagan

అయితే ఎన్టీఆర్ ప్రోత్సాహంతో తెలంగాణలో సైతం ఎంతో మంది నాయకులు ఎదిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న చాలా మంది మంత్రులది పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీయే. కానీ వారెవరూ రియాక్ట్ కాలేదు. టీడీపీ వర్థంతి, జయంతిలు నిర్వహించిన మంత్రులు, నేతలు సైతం స్పందించిన దాఖలాలు లేవు. కానీ షర్మిళ ఒక్కరే స్పందించారు. ఎన్టీఆర్ మంచి నాయకుడని కొనియాడారు. అదే సమయంలో తన తండ్రి వైఎస్సార్ గురించి కూడా ప్రస్తావించారు. పేరు మార్పుతో వచ్చేదేమీ లేదని.. తన తండ్రి కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. అటు ఎన్టీఆర్ కు, ఇటు వైఎస్సార్ కు సమ ప్రాధాన్యిమిచ్చారు. తెలంగాణలోని సీమాంధ్ర షెటిలర్స్ లో అటు ఎన్టీఆర్, ఇటు వైఎస్సార్ అభిమానులు ఉన్నారు. వారి అభిమానాన్ని చూరగొనేందుకే హెల్త్ యూనివర్సిటీ ఇష్యూను షర్మిళ వాడుకున్నారన్న టాక్ నడుస్తోంది.

Also Read: NTR Health University Row: నాటి వైశ్రాయ్ ఎపిసోడ్ రిపీట్ … ఎన్టీఆర్ మాకు అవసరం లేదు.. విజయవాడలో పోస్టర్ల కలకలం

Sharmila- Jagan
Sharmila- Jagan

మరో వైపు ఏపీ సీఎం జగన్ ప్రోత్సాహంతోనే షర్మిళ పార్టీ పెట్టారన్న టాక్ ఉంది. జగన్ తో వ్యక్తిగత విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని.. ఆమె పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదన్న ప్రచారం ఉంది. అందుకే దానికి విరుగుడుగా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును అస్త్రంగా చేసుకున్నారు. సోదరుడు నిర్ణయాన్నే తప్పుపట్టారు. తన వెనుక తన అన్నలేడని స్పష్టతనిచ్చారు. రాజకీయంగా తాను రాటుదేలుతున్నానని సంకేతాలిచ్చారు. అయితే షర్మిళ వ్యూహం తెలంగాణ వరకూ బాగానే ఉన్న.. ఏపీలో మాత్రం అన్నజగన్ ను బాగా డ్యామేజ్ చేశారు. షర్మిళ కామెంట్స్ ను అటు టీడీతో పాటు విపక్షాలు ప్రచార అస్త్రంగా చేసుకుంటున్నాయి.

Also Read: Top Extinct Animals: భారత అడవిదున్న నుంచి ఆఫ్రికా నల్ల ఖడ్గమృగం వరకూ.. గత 150 ఏళ్లలో అంతరించిన జంతువులు ఇవీ

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version