Sardar Ravinder Singh: టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలే మిగులుతున్నాయి. ఇప్పటికే హుజురాబాద్ ఫలితంతో మింగుడు పడని టీఆర్ఎస్ కు కరీనంగర్ లో మరో దెబ్బ తగిలేందుకు సిద్ధంగా ఉంది. కరీంగనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ నేత సర్దార్ రవీందర్ సింగ్ షాక్ ఇస్తున్నారు. స్థానిక సంస్థల తరఫున నామినేషన్ వేసి అదృశ్యమయ్యారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసలు ఆయన ఎక్కడకెళ్లారనే దానిపై సమాచారం లేదు. ఫోన్ స్విచ్ ఫ్ లో ఉంది. దీంతో నేతల్లో గుబులు మొదలైంది.

హుజురాబాద్ లో తగిలిన దెబ్బకే కోలుకోలేని స్థితిలో ఉన్న టీఆర్ఎస్ కు ఇప్పుడు సర్దార్ రవీందర్ సింగ్ మింగుడుపడటం లేదు. అనుకున్నదొక్కటి అయిందొక్కటి అంటూ నేతల్లో అంతర్మథనం కొనసాగుతోంది. ఎలాగైనా బుజ్జగించాలని చూసినా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇక ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారు. అంతా సాఫీగా సాగిపోతోందనుకున్న వ్యవహారం ఒక్కసారిగా మలుపు తిరిగింది.
Also Read: విరోధులు ఒక్కటైన వేళ.. దీక్షలో రేవంత్-కోమటిరెడ్డి కలయిక వెనుకున్నదెవరు?
ఇదంతా ఈటల నేతృత్వంలోనే జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో కూడా ఆయన మళ్లీ మేయర్ పదవి కోరినా అధిష్టానం తిరస్కరించడంతో ఆయనలో ఆగ్రహం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోనే ఆయన టీఆర్ఎస్ పై కోపంతో నామినేషన్ వేసి ఈటల డైరెక్షన్ లో చక్రం తిప్పుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు గొంతులో పచ్చి వెలక్కాయ పడిన చందంగా మారింది.
ఏదిఏమైనా భవిష్యత్ లో టీఆర్ఎస్ కు గడ్డు రోజులే అని తెలుస్తున్నాయి. ఇన్నాళ్లు మాకెదురు లేదని విర్రవీగిన అధికార పార్టీ ఇప్పుడు ఆలోచనలో పడుతోంది. పార్టీని గట్టెక్కించాలంటే ఎలా అనే ఆందోళన మొదలైంది. సర్దార్ రవీందర్ సింగ్ ను దారిలోకి తీసుకురావడమెలా అని మీమాంసలో పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలని పావులు కదుపుతోంది.
Also Read: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా?