Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఒక సీన్ రిపీట్ అవుతుంది. పోలవరానికి నిధులు అడిగాం, విభజన హామీలు అమలు చేయాలని కోరాం. ఏపీని ఆదుకోవాలని విన్నవించాం. అవకాశముంటే విలేఖర్ల సమావేశం నిర్వహించి ఈ విషయాలను వెల్లడిస్తారు. లేకుంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అయితే గత మూడేళ్లుగా సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సేమ్ ప్రెస్ నోట్ అంటూ మీడియా వర్గాలు చెబుతుంటాయి. తేదీలే మార్పు అని సరదాగా వ్యాఖ్యానిస్తుంటాయి. తాజాగా జగన్ చేపట్టిన ఢిల్లీ టూర్ చప్పగా, ఒక పూటలో ముగిసిపోయింది. ఢిల్లీ పెద్దలెవరూ పెద్దగా పట్టించుకోలేదని ప్రచారం సాగుతోంది. చివరికి వైసీపీకి అనుకూలంగా ఉండే నీలి మీడియా కూడా జగన్ టూర్ కు ప్రాధాన్యత ఇవ్వలేదు. పెద్దగా కవరేజీ చేయలేదు. ఉదయం ప్రధాని మోదీతో జగన్ అరగంట పాటు ఉన్నారు. కానీ వారి మధ్య జరిగిన చర్చలేవీ బయటకు రాలేదు. షరా మామ్మూలుగా పోలవరానికి అదనపు నిధులు,ఇతరత్రా డిమాండ్లను ఉంచామని మాత్రం ప్రెస్ కు ఒక నోట్ రిలీజ్ చేశారు. అనంతరం జగన్ విద్యుత్ శాఖ మంత్రి, తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపి తిరుగు పయనమయ్యారు.
తన వెంట ఆ ఇద్దరికే చాన్స్..
అయితే ఈ సారి ఢిల్లీ పర్యటనలో తన వెంట వచ్చే వైసీపీ నేతలను జగన్ కుదించేశారు. తన వెంట కేవలం ఎంపీలు విజయసాయిరెడ్డి,మిధున్ రెడ్డిలను మాత్రమే తీసుకెళ్లారు. ఇతర ఎంపీలు ఢిల్లీలో అందుబాటులో ఉన్నా వారెవరికీ చాన్స్ ఇవ్వలేదు. ఇది చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ సామాజిక న్యాయమంటూ పెద్దమాటలు వల్లెవేసే సీఎం జగన్ ప్రధాని, హోం శాఖ మంత్రులను కలిసినప్పుడు, విదేశీ పర్యటనలు చేసినప్పుడు, ఇంపార్టెంట్ మీటింగులకు తన సొంత సమాజికవర్గానికి చెందిన కీలక నాయకులను మాత్రమే తన వెంట తీసుకెళతారు. దీనిపై పార్టీ వర్గాల్లో కూడా ఒక రకమైన ప్రచారం ఉంది. ఆ నాయకులు తప్ప తాము పనికిరామా అంటూ అంతర్గత సమావేశాల్లో సరదాగా చర్చించుకుంటారు. అధినేత వివక్ష చూపుతున్నారన్న అసంతృప్తి అయితే మిగతా ఎంపీల్లో ఉంది.
Also Read: Lepakshi Knowledge Hub Scam: ‘లేపాక్షి’ స్కాం జగన్ ను ముంచేస్తుందా?
పరిస్థితులు చక్కదిద్దుతామనుకున్నా..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సీఎం జగన్ ఢిల్లీ టూర్ సాగినట్టు తెలుస్తోంది. చాలా తక్కువ వ్యవధిలో ఆయన ఆశించిన స్థాయిలో జరగలేదని సమాచారం. ముందుగా అమిత్ షాను కలుస్తారని ప్రచారం సాగినా.. ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా స్వప్రయోజనాల కోసమే ఢిల్లీ బాట పట్టారని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ మాఫియా మూలాలు ఏపీలో ఉండడం, వైసీపీ నేతల పేర్లు బయటకు రావడంతో వారిని కాపాడేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల హస్తం ఉందని అటు రాష్ట్ర బీజేనీ నేతలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల బీజేపీ టీడీపికి దగ్గరవుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. పైగా చంద్రబాబు శ్రేయోభిలాషి రామోజీరావు పావులు కదుపుతుండడంతో జగన్ లో కలవరం ప్రారంభమైందని..దానిని చల్లబరుచుకోవడానికే ఆయన హస్తినా బాట పట్టారన్న ప్రచారం కూడా ఉంది.
Also Read:Pawan Kalyan: అమరావతిపై తన స్టాండ్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్