Lepakshi Knowledge Hub Scam: ఏపీ సీఎం జగన్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీఇన్నీ కావు. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు పోగుచేసుకున్నారని ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. ప్రత్యర్థులైతే లక్షల కోట్లు అవినీతి చేశారని ఆరోపిస్తూ వచ్చారు. కంపెనీలకు ఆయాచితంగా లబ్ధి చేకూర్చి వారితో తిరిగి తన కంపెనీలో పెట్టుబడులు పెట్టించారని ఈడీ సైతం జగన్ పై కేసులు నమోదుచేసింది. అవన్నీ ఇప్పుడు విచారణలో ఉన్నాయి. అయితే అనంతపురం లేపాక్షి భూముల విషయంలో కూడా జగన్ పై అనేక అభియోగాలు ఉన్నాయి.అయితే ఇప్పుడు సీఎం అయ్యాక ఆ భూములు కొల్లగొట్టారని.. స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. మద్యం, ఇసుక అంతా సీఎం జగన్ చేతిలో ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నగదు లావాదేవీలు చేస్తూ బ్లాక్ మనీ పోగేసుకుంటున్నారని సైతం విమర్శలకు గుప్పిస్తోంది. నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టకొని లేపాక్షి భూముల విషయంలో జగన్ క్విడ్ ప్రోకు పాల్పడ్డారని ఆరోపణలుండగా.. ఇప్పుడు భూములను కొట్టేశారని విపక్షాలు తీవ్ర స్థాయిలో అభియోగాలు మోపుతున్నాయి. దీంతో సీఎం జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆర్థిక నేరాలు ఇలా కూడా చేయొచ్చా?
తాజాగా లేపాక్షి భూముల వ్యవహారంలో ఓ గలీజు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక నేరాలు ఇలా చేయవచ్చా? అన్న రీతిలో సరికొత్తగా గేమ్ ప్లాన్ తో వేలాది ఎకరాలు సొంతం చేసుకునేందుకు మాస్టార్ ప్లాన్ వేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లేపాక్షి హబ్ పేరుతో వేలాది ఎకరాల భూములను ఇందూ ప్రాజెక్టుకు కేటాయించారు. కేవలం ఎకరా రూ.50 వేలకే విక్రయించారు. అయితే ఈ విషయంలో పెద్దఎత్తున క్విడ్ ప్రో జరిగిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇందూ ప్రాజెక్టు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఆ భూములను బ్యాంకుల్లో కుదువ పెట్టి వేలాది కోట్ల రూపాయల రుణం తెచ్చుకుంది. ఇతర లావాదేవీలకు మళ్లించింది. అందులో కొంత మొత్తం జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఈడీ ఆ ఆస్తులను అటాచ్ చేసింది. ఇక్కడ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు. బ్యాంకులకు రుణాలు తిరిగి కట్టలేమని ఇందూ ప్రాజెక్టు తేల్చేసింది. అదే సమయంలో ఓ కంపెనీ వచ్చి రూ.500 కోట్లు ఇస్తాం. ఆ భూములను వదిలేయండి అని కోరడంతో బ్యాంకులు ఒప్పుకున్నాయి. అయితే ఐదు వందల కోట్లు ఇచ్చి ఇందూ ప్రాజెక్టు భూములను సదరు కంపెనీ కొట్టేయ్యనుందన్న మాట.
Also Read: Janasena-TDP Alliance: కేసీఆర్ వ్యూహంతో పవన్.. జనసేన-టీడీపీ పొత్తు ఫిక్స్.. సీట్ల లెక్క ఇదీ..
ఆ కంపెనీ సీఎం సమీప బంధవులదే..
అయితే ఈ భూములు దక్కించుకున్న కంపెనీ ఎవరిదో కాదు. ఏపీ సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు ఒన్ ఆఫ్ దీ డైరెక్టర్. లావాదేవీలకు డబ్బులు సమకూర్చుతున్నది అరబిందో పరిశ్రమ. అంటే ఏపీలో కీలక ప్రాజెక్టులు ఆ సంస్థే టేకోవర్ చేస్తోంది. ప్రభుత్వ కీలక పెద్దలకు కావాల్సిన వారే సదరు కంపెనీలో ఉన్నారన్న మాట. బయటకు మాత్రం కొత్తగా కనిపించేలా ఎర్తిన్ ప్రాజెక్టు అని చెబుతున్నారు. కానీ తెరవెనుక మాత్రం గుడు పుఠాని నడిపేది ప్రభుత్వ పెద్దల సన్నిహితులే. మొత్తానికి ఒక ప్రభుత్వం కేటాయించిన భూమి సదరు కంపెనీ రుణాలకు కుదువ పెట్టడం ఏమిటి? అదే భూమిని బ్యాంకు స్వాధీనం చేసుకోవడం ఏమిటి? బ్యాంకు అతి తక్కువ ధరకు మరో కంపెనీ చేతిలో పెట్టడం ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అక్కడ పరిశ్రమలు కట్టకపోతే ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం మెతక వైఖరి వెనుక..అ దే ప్రభుత్వ పెద్దలు ఆయాచితంగా లబ్ధి పొందుతున్నారన్న మాట.
భూమి ఒకటే స్కాములు రెండు..
అయితే భూమి మాత్రం ఒకటే. కానీ స్కాంలు మాత్రం రెండు. ఇది మామ్మూలు తెలివితేటలు కాదు. ఆర్థిక నేరాల్లో ఆరితేరిన వారు ఇటువంటి మోసాలకు పాల్పడగలరు. వాస్తవానికి భూములను ప్రభుత్వం ఎప్పుడో రద్దు చేసింది. కానీ ఇంతవరకూ స్వాధీనం చేసుకోలేదు.పైగా ఇందూ సంస్థ రుణాలు తిరిగి చెల్లించలేదు. కానీ బ్యాంకులు ఆ సంస్థపై యాక్షన్ తీసుకోలేదు. పోనీ బ్యాంకులు ఆ భూములను స్వాధీనం చేసుకొని ఆక్షన్ కు వెళ్లాయంటే అదీ లేదు. పోనీ అలా వెళ్లినా బ్యాంకు లోన్లు రికవరీ ఈజీగా జరిగేది. కానీ మరొకరికి ఆయాచితంగా లబ్ధి చేకూర్చేందుకు బ్యాంకులు ప్రయత్నించడం వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.