https://oktelugu.com/

సీఎం జగన్ రైట్ హ్యాండ్ ఎందుకు తప్పుకున్నాడబ్బా?

ఏపీ సీఎంవోలో గత కొద్దిరోజులుగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి రాష్ట్రానికి సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు జరుగుతుంటాయి. సీఎంవోలో ఉండే సీనియర్ అధికారుల సలహాలు,  సూచనలను సీఎం లెక్కలోకి తీసుకొని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. Also Read: జగన్ పై కోడికత్తి కేసు.. ఆ పగ ఇప్పుడు నెరవేరిందట! ఏపీ సీఎంవోలో గత నాలుగు నెలల క్రితం కొందరు అధికారులను తప్పించారనేది తెల్సిందే. తాజాగా మరో అధికారి కూడా తాను […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 10:44 AM IST
    Follow us on


    ఏపీ సీఎంవోలో గత కొద్దిరోజులుగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి రాష్ట్రానికి సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు జరుగుతుంటాయి. సీఎంవోలో ఉండే సీనియర్ అధికారుల సలహాలు,  సూచనలను సీఎం లెక్కలోకి తీసుకొని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు.

    Also Read: జగన్ పై కోడికత్తి కేసు.. ఆ పగ ఇప్పుడు నెరవేరిందట!

    ఏపీ సీఎంవోలో గత నాలుగు నెలల క్రితం కొందరు అధికారులను తప్పించారనేది తెల్సిందే. తాజాగా మరో అధికారి కూడా తాను సీఎంవో నుంచి తప్పుకున్నట్లు ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. నవంబర్ 1న సీఎంవో బాధ్యతల నుంచి తప్పుకున్న పీవీ రమేష్ 18రోజుల తర్వాత తానే స్వయంగా ప్రకటించడం కొసమెరుపు. ఆయన సీఎంవో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడానికి ఇన్ని రోజుల సమయం ఎందుకు తీసుకున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.

    తాను 35ఏళ్ల నుంచి అంతర్జాతీయ.. జాతీయ.. రాష్ట్ర స్థాయిల్లో ప్రజాసేవ చేస్తున్నట్లు పీవీ రమేష్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సుపరిపాలన, సేవలందించేందుకు తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని తెలిపారు. సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    Also Read: చంద్రబాబు బేజారు.. జగన్ ఇంత రాటుదేలాడా?

    పీవీ రమేష్ సీఎంవో తప్పుకుంటారనే కొద్దినెలల నుంచి ప్రచారం జరుగుతోంది. నాలుగు నెలల క్రితం సీఎంవోలో బాధ్యతలు నిర్వహిస్తున్న అజేయ్ కల్లాం.. పీవీ రమేష్.. జే.మురళిని తప్పించారు. వీరి స్థానంలో ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు అవకాశం కల్పించారు.

    ఆ సమయంలోనే పీవీ రమేష్‌కు సీఎం జగన్ తొలుత కీలక శాఖలు అప్పగించారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ మధ్యలో కోతవేసి వైద్యం, విద్య వంటి శాఖలకే పరిమితం చేశారు. ఇక తాజాగా ఆయన సీఎంవో నుంచి పూర్తిగా తప్పించారు. కొన్నినెలల నుంచి వరుసగా సీఎంవోలోని కీలక అధికారులను తప్పిస్తుండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్