https://oktelugu.com/

చంద్రబాబు మౌనం.. దేనికి సంకేతం?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు మౌనం దాల్చారు. నేతలు కొట్లాడుకుంటున్నా.. మాటల దాడులు చేసుకుంటున్నా తనకేమీ పట్టన్నట్టుగా సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశమైంది. అనవసరంగా నేతల గొడవల్లో వేలు పెట్టడం ఇష్టం లేదా? లేక సదురు మహిళా నేతను చంద్రబాబు గాలికి వదిలేశాడా? పార్టీలో అంత రచ్చ జరుగుతున్నా బాబు మౌనం వెనుక కారణమేంటన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ గొడవలను పట్టించుకోవడం లేదు. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 6, 2020 / 07:27 PM IST
    Follow us on


    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు మౌనం దాల్చారు. నేతలు కొట్లాడుకుంటున్నా.. మాటల దాడులు చేసుకుంటున్నా తనకేమీ పట్టన్నట్టుగా సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశమైంది. అనవసరంగా నేతల గొడవల్లో వేలు పెట్టడం ఇష్టం లేదా? లేక సదురు మహిళా నేతను చంద్రబాబు గాలికి వదిలేశాడా? పార్టీలో అంత రచ్చ జరుగుతున్నా బాబు మౌనం వెనుక కారణమేంటన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

    టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ గొడవలను పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో ఇద్దరు ముఖ్య పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నా అవేమీ పట్టనట్టుగా మౌనం దాల్చడంపై సదురు నేతలు గుర్రుగా ఉన్నారు.

    రెండురోజులుగా టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.. ఇద్దరు నాయకులు గతంలో కూడా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో భీకరంగా రాజకీయ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పార్టీ మరియు ఎన్నికల ప్రయోజనాల విషయంలో కొంత రాజీపడ్డారు. అధికారంలో ఉండడంతో సదురు నేతలు కొంత సంయమనం పాటించారు.

    2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత సుబ్బారెడ్డి, అఖిల ప్రియల మధ్యనున్న విభేదాలు భగ్గుమన్నాయి. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ ఇద్దరూ కలిసి తన హత్యకు కుట్రపన్నారని.. రూ.50 లక్షల సుపారీ ఇచ్చారని తాజాగా సుబ్బారెడ్డి ఆరోపించడం కలకలం రేగింది. టీడీపీలో గొడవ పీక్స్ కు చేరింది.

    అయితే ఈ ఆరోపణలపై అఖిల ప్రియ స్పందించింది. సుబ్బారెడ్డి తీవ్రమైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. అతడి వెనుక వైసీపీ హస్తం ఉందని అనుమానిస్తున్నట్టు అఖిల ఆరోపించారు.

    తాజాగా సుబ్బారెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. అఖిల రాజకీయాల్లో కొనసాగితే.. ఆళ్లగడ్డలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారని సుబ్బారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో అఖిలప్రియ తప్ప మరే వ్యక్తికి అయినా మద్దతు ఇస్తానని అన్నారు. టీడీపీ నాయకత్వం అఖిలప్రియ విషయంలో పునరాలోచన చేయాలని ఆయన కోరారు.

    ఇంత రచ్చ జరుగుతున్నా.. ఇద్దరు టీడీపీ నేతలు తగవులాడుకుంటున్నా టీడీపీ అధినేతలో స్పందన లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మాజీ మంత్రి, సీనియర్ నేత ఇద్దరిని పిలిచి ఒక తాటిపైకి తీసుకురావడానికి బదులు.. చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఈ రచ్చ మరింత ఉదృతం అవుతోంది. కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులపై చంద్రబాబు నియంత్రణ పూర్తిగా కోల్పోయాడని అర్థమవుతోంది. చూస్తుంటే పార్టీపై పట్టును కూడా చంద్రబాబు కోల్పోతున్నారని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

    -నరేశ్ ఎన్నం