BJP- NTR Health University: ఎన్టీఆర్.. ఈ పేరు జనం గుండెల్లో నాటుకుపోయిన పేరు. ఎన్టీఆర్‌కు ఒక వ్యక్తిగా కాకుండా.. ఒక బ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకు అభిమానులు ఉన్నారు. సినిమా నేపథ్యం ఉండడం, దాదాపు ఐదు దశాబ్దాలు ఇండస్ట్రీలో అగ్రనాయకుడిగా ఉండడం, తన నటనతో అన్నివర్గాలను ఆకట్టుకోవడంతో ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇదే అభిమాను అండ, తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో 1983లో నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజలు టీడీపీకి నాడు బ్రహ్మరథం పట్టారు. నాలుగు ఎన్నికల్లో గెలిచిన ఎన్టీఆర్ పాలనతోనూ తనదైన ముద్ర వేశారు. దీంతో రాజకీయంగా, పాలనా తీరులోనూ ఆయనకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన పేరును బోర్డులపై తొలగించవచ్చేమోగానీ, ప్రజలు, అభిమానులు, రాజకీయ నేతల హృదయాల నుంచి తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించిన నేపథ్యంలో ఎన్టీఆర్‌కు తెలుగు ప్రజల్లో ఉన్న అభిమానం తమకు ఇబ్బంది రాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఎన్టీఆర్ ఇమేజ్‌ను సాధ్యమైనంత వరకు వాడుకోవాలని చూస్తోంది.

టీడీపీకి దీటుగా..
ఎన్టీఆర్ అంటే తెగులు ప్రజలకు గుర్తొచ్చే పార్టీ టీడీపీ. అయితే ఆ పార్టీని 1995లో చంద్రబాబు నాయుడు లాక్కోవడం, నందమూరి తారకరామారావును గద్దె దించడంతో ప్రస్తుతం టీడీపీ చంద్రబాబు పార్టీగా మారింది. అయినా ఎన్టీఆర్‌ను ఇప్పటికీ టీడీపీ నేతలు తమ పార్టీ వ్యవస్థాపకుడిగానే పూజిస్తున్నారు. ఆయన పేరుతోనే పాలన సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో నందమూరి ఇమేజ్‌తో డ్యామేజ్ జరుగకుండా అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. టీడీపీ పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, అధికార వైఎస్సార్‌సీపీ అంతే దీటుగా సమర్థించుకుంటోంది. ఇందుకోసం టీడీపీ గతంలో ఎన్టీఆర్‌ను అవమానించిన తీరు, చంద్రబాబు వెన్నుపోటు గురించి నాడు రామారావు మాట్లాడిన మాటలు, వీడియోలు, ఆడియోలను వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ ఎన్టీఆర్ తమవాడని చెప్పుకునే కంటే ఎక్కువగా వైసీపీ చంద్రబాబు రామారావును ఎంతగా ద్వేశించారు అనే విషయాన్నే ప్రచారం చేస్తూ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అధికార పార్టీ మంత్రులు,ఎమ్మెల్యేలు, నాయకులు ముప్పేటా చంద్రబాబుపై దాడి చేస్తున్నారు. దీంతో ప్రజల్లో మరోసారి చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గుడా అన్న చర్చ జరుగుతోంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోరుకున్నట్లుగా ఎన్టీఆర్‌కు తామే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
బీజేపీ దూకుడు...
ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఎన్టీఆర్ ఇమేజ్‌ను ఉపయోగించుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. హెల్త్ యూనివర్సిటీ పేరును వ్యతిరేకిస్తూ.. నందమూరికి మద్దతుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. మరోవైపు వైసీపీని కూడా పూర్తిగా వ్యతిరేకించడం లేదు. కర్ర విరగకుండా.. పాము చావకుండా బీజేపీ నేతలు యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందిస్తున్నారు. ప్రజల కోణంలో వైసీపీ ప్రభుత్వం ఆలోచించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సేవలను కూడా వచ్చే ఎన్నికల్లో వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఎన్టీఆర్ పేరును వీలైనంత ఎక్కువగా వాడుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ కూడా ప్రచారం..
గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్టీఆర్ ఇమేజ్‌ను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ వారసుడు వైఎస్సారే అని ప్రచారం చేసుకున్నారు. నందమూరి పాలనను మరిపించేలా ఎస్సార్ పాలన సాగిస్తున్నారని చెప్పాకున్నారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ కూడా ఎన్టీఆర్‌ను గౌరవిస్తూ, మద్దతుగా మాట్లాడుతూ హైదరాబాద్‌లోని సెటిలర్ల ఓట్లు పొందే ప్రయత్నం చేశారు.
[…] Also Read: BJP- NTR Health University: ఎన్టీఆర్ పేరుపై వివాదంలో … […]
[…] Also Read: BJP- NTR Health University: ఎన్టీఆర్ పేరుపై వివాదంలో … […]