https://oktelugu.com/

టీడీపీపై బీజేపీ ఎందుకు కోపంగా ఉంది?

బీజేపీపై టీడీపీ అదృశ్య దాడి చేసింది. ఇప్పటికే దూకుడు మీద ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా బీజేపీ నేతలకు ఇది బలంగా తాకింది. దీంతో టీడీపీ దాడిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం చేసిన పని అని బీజేపీ గట్టిగా అనుమానిస్తోంది. దీనికి ప్రతి చర్య దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య పరిణామాలు వేడి పుట్టిపుట్టిస్తున్నాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 27, 2020 / 03:23 PM IST
    Follow us on


    బీజేపీపై టీడీపీ అదృశ్య దాడి చేసింది. ఇప్పటికే దూకుడు మీద ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా బీజేపీ నేతలకు ఇది బలంగా తాకింది. దీంతో టీడీపీ దాడిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం చేసిన పని అని బీజేపీ గట్టిగా అనుమానిస్తోంది. దీనికి ప్రతి చర్య దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య పరిణామాలు వేడి పుట్టిపుట్టిస్తున్నాయి.

    Also Read: తెలంగాణలో అవినీతి కథ.. మారుతోందా?

    ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వెళ్తున్నారు. ఇన్నాళ్లు టీడీపీకి ఫేవర్ గా రాజకీయం వెలగబెట్టిన వారిని ఏరివేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ బ్యాచ్ కు సోము వీర్రాజు కంటగింపుగా మారారు.

    సోషల్ మీడియాలో ఏపీ బీజేపీపై వ్యూహాత్మకంగా దాడి జరుగుతోంది. ఈ దాడి ప్రధానంగా అమరావతి వంటి సమస్యలపైనే చేస్తున్నారు. దాడి చేసిన వారు ముఖ్యంగా సోముకరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా? వీర్రాజును, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావును లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీలోని పలు విషయాల్లో జీవీఎల్ తాజాగా చంద్రబాబును, టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

    Also Read: కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?

    సహజంగానే బలమైన టీడీపీ సోషల్ మీడియా యోధులు జీవీఎల్ పై దాడి చేస్తున్నట్టు ఏపీ బీజేపీ శాఖ గుర్తించింది. ఇప్పటికే ఈ ఇష్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తనపేరు మీద బహిరంగ లేఖ రాశారు. సీనియర్ నాయకులపై ఇలాంటి దాడులను పార్టీ సహించదని.. తమ వనరులన్నింటిని ఉపయోగించుకొని నేరస్థులను బుక్ చేస్తామని హెచ్చరించారు. అయినా టీడీపీ సోషల్ మీడియా టీం ఆగడం లేదట.. విషప్రచారాన్ని హోరెత్తిస్తోందట..

    టీడీపీ తనను, ఏపీ బీజేపీని టార్గెట్ చేసిందని గ్రహించిన సోము వీర్రాజు.. టీడీపీ సోషల్ మీడియా యోధులకు గట్టి షాకిచ్చేందుకు రెడీ అయ్యారని తెలిసింది. లేకపోతే బీజేపీపై ఏపీలో మరిన్ని దాడులు జరుగుతాయని..దీన్ని మొగ్గులోనే తుంచివేయాలని సోము వీర్రాజు పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. త్వరలోనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయబోతున్నట్టు తెలిసింది.

    -ఎన్నం