https://oktelugu.com/

BJP CMs: తెలంగాణకు బీజేపీ సీఎంలు వరుసగా ఎందుకొస్తున్నారు?

BJP CMs: తెలంగాణలో బీజేపీ జోష్ మీదుంది. అధికారం కోసం అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో జాతీయ నేతలతోపాటు సీఎంలు కూడా తెలంగాణలో పర్యటిస్తూ అధికార పార్టీని విమర్శిస్తున్నారు. నియంత పాలన చేస్తున్న టీఆర్ఎస్ విధానాలను ఖండిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగట్టారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 9, 2022 / 06:14 PM IST
    Follow us on

    BJP CMs: తెలంగాణలో బీజేపీ జోష్ మీదుంది. అధికారం కోసం అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో జాతీయ నేతలతోపాటు సీఎంలు కూడా తెలంగాణలో పర్యటిస్తూ అధికార పార్టీని విమర్శిస్తున్నారు. నియంత పాలన చేస్తున్న టీఆర్ఎస్ విధానాలను ఖండిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగట్టారు.

    BJP CMs

    అదే కోవలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి టీఆర్ఎస్ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వరంగల్ లో పలు పాల్గొనేందుకు రానున్నారు. బండి సంజయ్ తో కలిసి అసోం ముఖ్యమంత్రి ధర్నా చేయనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా పలువురు నేతలు పాల్గొని బీజేపీని బలోపేతం చేయనున్నట్లు తెలుస్తోంది.

    గతంలో జరిగిన బెంగాల్ ఎన్నికల్లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేశారు. ప్రతి వారం ఢిల్లీ నుంచి ముఖ్య నేత వెళుతూ కార్యకర్తల్లో జోష్ నింపేవారు. ప్రస్తుతం కూడా తెలంగాణలో కూడా ఇలాగే చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి బీజేపీలో చేరేందుకు నేతలు క్యూ కట్టనున్నట్లు సమాచారం. దీంతో నేతల్లో విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: KCR Politics: టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చే స్కెచ్ వేసిన కేసీఆర్?

    రాష్ర్టంలో రాజకీయాలు మారుతున్నాయి. రెండు పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో బీజేపీ నేతలను ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీకి మరింత బలం చేకూర్చాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: Vanama Raghava: ఒక్కొక్కరు ఒక్కో నయీమ్… నియోజకవర్గం సామంత రాజ్యం

    Tags