Bihar Election 2025: త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చకు దారితీస్తున్నాయి. అటు అధికార పార్టీ నుంచి నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆర్జెడి, కాంగ్రెస్ కూటమి తరఫున రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ప్రచారం చేస్తున్నారు. పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీహార్ ప్రజలపై వరాలజల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీ బీహార్ లో ఉన్న మహిళల ఖాతాలలో డబ్బులు కూడా వేసింది. మొత్తంగా చూస్తే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని నితీష్, నరేంద్ర మోడీ చెబుతున్నారు. తమ మళ్ళీ అధికారంలోకి వస్తే బీహార్ దశను మార్చుతామని అంటున్నారు. ఇందుకు కాంగ్రెస్ కూటమి కూడా దీటుగానే బదులు చెబుతోంది…
ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగానే యూట్యూబ్ ఛానల్స్ హడావిడి చేస్తుంటాయి. ఇప్పుడు వాటి జమానా నడుస్తుంది కాబట్టి తప్పడం లేదు. అయితే కొన్ని సందర్భాలలో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు చేసే ఇంటర్వ్యూలు, ఇతర విషయాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తాయి. ఇప్పుడు అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో బీహార్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బీహార్ రాష్ట్రంలోని ఓ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది మధ్య వయసు వారు కూర్చున్నారు. వారి దగ్గరికి వెళ్లిన అతడు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ప్రశ్నించాడు. దానికి వారు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తుందని సమాధానం చెప్పారు. మంచి పనులు చేశారని.. విప్లవత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అదే సమయంలో ఒక బాలుడు అక్కడికి వచ్చాడు. ఆ మధ్య వయసు ఉన్నవారు మాట్లాడుతుండగానే.. మధ్యలోకి దూరాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. పనులు మధ్యలో ఆపివేశారని.. మిగతా పనులు కనీసం పూర్తి కూడా చేయలేదని.. అటువంటి పార్టీకి ఎలా ఓటు వేస్తారని ఆ బాలుడు ఆ మధ్య వయసు వారిని ప్రశ్నించాడు. ఎటువంటి పనులు కూడా చేయలేదని.. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ బాలుడు వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించిన మీడియాను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. మరోవైపు దీనికి బిజెపి నేతలు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించినంతమాత్రాన తమ ప్రభుత్వానికి ఏమీ కాదని స్పష్టం చేస్తున్నారు. అదే కాదు వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తామని వివరిస్తున్నారు. అయితే ఆ బాలుడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో మాత్రం బీహార్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.
Forget about Gen Z, even Kid Z of Bihar is enough for Whatsapp uncles
This boy needs to go viral pic.twitter.com/Y1MfswWX2U
— Ankit Mayank (@mr_mayank) October 13, 2025