ఈటల తొలగింపు వెనుక ఎవరున్నారు?

తెలంగాణ వైద్యఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి తొలగించి.. ఆయన వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ తీసేసుకున్నారు. ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడంతో విచారణ జరిపి నిర్ధారించుకున్నాక ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఏర్పడకముందు ఉమ్మడి ఏపీలో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఉండేవారు. కేసీఆర్ ఎంపీ గా ఢిల్లీ రాజకీయాలను ఏలితే.. ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్ ను ఈటల […]

Written By: NARESH, Updated On : May 1, 2021 3:46 pm
Follow us on

తెలంగాణ వైద్యఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి తొలగించి.. ఆయన వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ తీసేసుకున్నారు. ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడంతో విచారణ జరిపి నిర్ధారించుకున్నాక ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ ఏర్పడకముందు ఉమ్మడి ఏపీలో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఉండేవారు. కేసీఆర్ ఎంపీ గా ఢిల్లీ రాజకీయాలను ఏలితే.. ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్ ను ఈటల రాజేందర్ లీడ్ చేసేవారు. నాడు కేటీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. హరీష్ రావు కొత్తగా వచ్చారు. దీంతో కేసీఆర్ కు రైట్ హ్యాండ్ గా ఈటల ఉండేవారు. అంతేకాదు తెలంగాణ తొలి మంత్రివర్గంలో రాష్ట్ర మొదటి ఆర్థిక మంత్రిగా ఈటలకు అందలం దక్కింది. ఒకప్పుడు టీఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర్ రావు తర్వాత అంతటి పెద్దనేతగా ఉన్న ఈటల ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు.

ఇప్పుడు మంత్రిగానూ ఈటలను తొలగించారు. దీంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అడిగే పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ తెలంగాణ ఉద్యమకారుడు ఈటల తొలగింపు వెనుక కథ అంతా నడిపించింది ఎవరు అని.. అందరూ ప్రశ్నిస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాష్ట్ర కేబినెట్ నుంచి ఈటల తొలగింపు వెనుక.. మెదక్ జిల్లాలో ఈటల భూకబ్జాను వెలికి తీయడం.. దాన్ని కేసీఆర్ వరకు ఫిర్యాదు చేయడం వెనుకున్న వ్యక్తిగా మంత్రి టి. హరీష్ రావు అని.. అందరి వేళ్లు అటువైపే చూపిస్తున్నాయి.

ఈటల కొత్త రాష్ట్రానికి మొదటి ఆర్థిక మంత్రి పనిచేశారు. ఈటల స్థానంలో మంత్రి హరీష్ రావు రెండోసారి అదే బాధ్యత నిర్వహించడం విశేషం. ఈ వివాదానికి హరీష్ రావు సూత్రధారి అని, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీని వెనుక ఉన్న వ్యక్తి హరీష్ అని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హరీష్ రావు స్కెచ్ వెనుక వేరే కథ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కు ఆదినుంచి బలమైన మద్దతుదారులుగా ఉన్న ఈటల లాంటి వారిని చాకచక్యంగా వేరు చేసి తరిమికొడితే.. ఆ తర్వాత కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ లో బలమైన మద్దతు ఉండదని.. ఇది తనకు లాభిస్తుందని హరీష్ ప్లాన్ వేశారని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. అందుకే హరీష్ ఇలా బలమైన టీఆర్ఎస్ వాదులను కేసీఆర్ ఫ్యామిలీకి దూరం చేస్తున్నారని అంటున్నారు.

మంత్రి ఈటలతోనూ హరీష్ కు సాన్నిహిత్యం ఉంది. హరీష్ ను సాగనంపే చర్యలను కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక చేశారనే ప్రచారం జరిగింది. హరీష్ వెంట నాడు ఈటల ఉన్నారని అంటారు. అందుకే బలమైన నేతలను హరీష్ రావు ముందే టీఆర్ఎస్ కు దూరం చేస్తున్నారని.. హరీష్ రావును కనుక టీఆర్ఎస్ నుంచి పంపించే చర్యలు చేపడితే ఏదైనా చేయడానికే హరీష్ ఇలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

కేసీఆర్ వెన్నెముకగా ఉన్న వారందరినీ తరిమికొట్టడం ద్వారా పార్టీలో కేసీఆర్ తర్వాత అధికారం చేపట్టబోయే కేటీఆర్‌ను బలహీనపరుచవచ్చని హరీష్ రావు ప్లాన్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. బలహీనమైన కేటీఆర్.. సీఎం కేసీఆర్ అంత బలమైన నేత కాకపోవడంతో ఆయన వారసత్వానికి కొనసాగించకుండా ఇలా ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇది టీఆర్ఎస్ లో కేసీఆర్ తరువాత హరీష్ రావుకే చాన్స్ ఉండేలా చూసుకుంటున్నాడని చెబుతున్నారు. భవిష్యత్ దృష్ట్యానే హరీష్ ఇలా చేసి ఉంటాడని ప్రచారం సాగుతోంది.

కానీ కేసీఆర్ -కేటీఆర్ లు ఇది జరగడానికి అనుమతిస్తారా? కల్వాకుంట్ల కుటుంబాన్ని బలహీనపరిచే విధంగా హరీష్ రావు చేసే పనులను వారు భవిష్యత్ లో అంగీకరిస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న?