https://oktelugu.com/

విశాఖ రాజధాని: అక్కడ ప్రభుత్వ భూమిని కొల్లగొట్టింది ఎవరు?

విశాఖ ఎంత పెద్ద సిటీనో అందరికీ తెలుసు. మరి అంత పెద్ద సిటీలో ప్రభుత్వానికి వంద ఎకరాల స్థలం కూడా లేకపోవడం ఏంటి…? అందుకే.. ఈ విషయంపై జగన్‌ సీరియస్‌గా ఉన్నారట. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారో వారి జాతకాలను తేల్చే పనిలో వైసీపీ సర్కార్‌‌ బిజీలో ఉంది. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించాక జగన్‌ కూడా అక్కడ ప్రతీ చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. అందులోభాగంగానే ముందుగా ఈ ప్రభుత్వ భూముల విషయంపై లోతైన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 10:58 AM IST
    Follow us on

    విశాఖ ఎంత పెద్ద సిటీనో అందరికీ తెలుసు. మరి అంత పెద్ద సిటీలో ప్రభుత్వానికి వంద ఎకరాల స్థలం కూడా లేకపోవడం ఏంటి…? అందుకే.. ఈ విషయంపై జగన్‌ సీరియస్‌గా ఉన్నారట. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారో వారి జాతకాలను తేల్చే పనిలో వైసీపీ సర్కార్‌‌ బిజీలో ఉంది. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించాక జగన్‌ కూడా అక్కడ ప్రతీ చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. అందులోభాగంగానే ముందుగా ఈ ప్రభుత్వ భూముల విషయంపై లోతైన విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా సిట్‌ను నియమించి.. దందాకు గురైన భూముల లెక్కలను తీయాలని చూస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇప్పటికే మేజర్‌‌ సిటీ అయిన విశాఖలో భూముల రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాలనా రాజధానిగా మారబోతున్న ఆ సిటీలో రేట్లు మరింతగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలోనూ విశాఖ నంబర్ వన్ సిటీనే. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖను పెద్దగా పట్టించుకున్న వారు లేరు. కానీ విభజన తరువాత ఈ సిటీ గురించి ప్రభుత్వం కూడా ఆలోచన చేయడంతో అక్కడి లొసుగులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత టీడీపీ పాలనలో అమరావతి రాజధాని పేరిట ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఎప్పుడో ఆరోపించింది. దాంతో సమాంతరంగా విశాఖలోనూ పెద్ద ఎత్తున భూ దందాలు చోటు చేసుకున్నాయి. పలుకుబడి కలిగిన పెద్దలంతా కలసి భూములను చక్కబెట్టేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా భూములను తమ గుప్పిట్లో పెట్టేశారు. నాటి సీఎం చంద్రబాబు కూడా సీరియస్ యాక్షన్ ఏదీలేకుండా తూతూమంత్రగా సిట్ వేసి కథ ముగించారు. కానీ.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ భూముల అక్రమాలపై స్పెషల్ ఫోకస్‌ పెడుతుందట.

    Also Read: ప్రధాని మోడీకి సీఎం జగన్ మరో సంచలన లేఖ

    విశాఖలో ఓ బలమైన సామాజికవర్గ వ్యాపారం పేరిట దశాబ్దాల క్రితమే వచ్చి పాతుకుపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వారికి పార్టీ అంటే కూడా టీడీపీనే. దీంతో వీరిని అక్కున చేర్చుకున్న చంద్రబాబు కూడా వీరి ఆగడాలను ఏనాడూ పట్టించుకోలేదు. వీరు కూడా రాజకీయ అండదొరకడంతో వేలాది ఎకరాల భూములను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారం పేరు చెప్పి నామమాత్ర ధరకు భూములు తీసుకున్నారనే అపవాదు కూడా ఉంది. ముందుగా కొంత భూమి తీసుకుని తర్వాత తర్వాత ఆ చుట్టూ ఉన్న భూములను కూడా కబ్జా చేయడంతో ఇప్పుడు విశాకలో అంగుళం జాగా కూడా సర్కార్ వారి స్థలం లేకుండా పోయిందని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల దగ్గర భూకబ్జాదారుల లెక్కలన్నీ జాగ్రత్తగా ఉన్నాయని చెబుతున్నారు. దాంతో ఒక్కొక్కరి గుట్టు వరసగా బయట పెట్టడానికి పై లెవెల్ నుంచి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు.

    Also Read: నజర్: విశాఖలో లోకల్‌ లీడర్లకు ఛాన్స్‌

    ఇప్పుడు విశాఖను పాలనా రాజధానికి ప్రకటించడంతో అక్కడ ప్రభుత్వ భూముల అవసరం ఏర్పడింది. కానీ.. ఇప్పుడు అక్కడ చూద్దామంటే ప్రభుత్వ భూమి కనిపించడం లేదు. ఏ వేలం పాట కూడా లేకుండానే సర్కార్ వారి భూములకు కన్నం పెట్టినరాజకీయ వ్యాపారులనే ఇప్పుడు వైసీపీ టార్గెట్ చేసింది. అలా వెనక్కి తీసుకున్న భూముల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యకలాపాలు మొదలెట్టాలని, అభివృద్ధి పనులు చేపట్టాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. అంటే.. ఈ ప్రయత్నంతో పైసా లేకుండానే ప్రభుత్వ భూములు అందుబాటులోకి వస్తాయి. వైసీపీ చేపడుతున్న ఈ భూ ఆపరేషన్ పై ప్రజల నుంచి కూడా హర్షాతిరేకాలు వస్తున్నాయట.